26.3 C
India
Thursday, July 4, 2024
More

    Cabinet in AP : ఏపీలో కేబినేట్ కూర్పుపై నాయకుల్లో ఉత్కంఠ

    Date:

    Cabinet in AP
    Cabinet in AP

    Cabinet in AP : ఆంధ్రప్రదేశ్ లో కూటమి 90 శాతానికి పైగా సీట్లు సాధించి పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి ఏఏ శాఖలు కేటాయిస్తారు. అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. ఏ ప్రాంతానికి, ఏ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, మిత్రపక్షాలకు ఎన్ని స్థానలు కేటాయించాలి. సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.

    మంగళవారం (జూన్ 11) రోజున మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకున్నారన్న విషయంలో వారికే చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి చెప్పే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం హోదాలో కేబినేట్ లో చేరడం ఖారారైనట్లే. ఆయనే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. దీంతో కలుపుకొని నాలుగు స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. మరో పార్టీ బీజేపీ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    ముందు నుంచే కసరత్తు..
    జగన్ ఓడిపోవడం ఖాయమని తెలిసిన చంద్రబాబు ఫలితాల కంటే ముందే మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్నదానిపై స్పష్టంగా ఉన్నారని పార్టీ వర్గాల నుంచి టాక్. కానీ, ఫలితాలు రావడంతో దాన్ని ముమ్మరం చేశారు. ఎన్డీయే కూటమి 164 స్థానాల్లో గెలుపొందటంతో.. ఆశావహుల సంఖ్య పెరిగింది. గతంలో విజయం సాధించిన వారితో విడివిడి సమావేశం అయ్యేవారు కానీ ఈ సారి అలా ఎవరితోనూ భేటీ కాలేదు. దీంతో మంత్రివర్గం స్థానం కోసం నేరుగా కలిసి విజ్ఞప్తి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కనీసం 20 నుంచి 30 మంది సమక్షంలోనే అందరినీ కలిశారు. కొందరు రెండేసిసార్లు వచ్చినా.. ఇతరులు ఉండగానే మాట్లాడారు.

    మహిళలు, యువతకు..
    కేంద్ర కేబినేట్ లో రాష్ట్రం నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. ఈ సారి అసెంబ్లీలో 21 మంది మహిళలు ఉన్నారు. ఇది గతం కంటే (గతంలో 14) 50 శాతం ఎక్కువ. ఈ సారి యువత కూడా అంతే స్థాయిలో గెలుపొందారు. ఆ మేరకు వారికి కేబినేట్ లో ప్రాధాన్యత పెరిగే వీలుంది. ఇమేజ్‌ ఉన్నవారికి, రాబోయే పదేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యమున్న వారికి ఈ సారి అధిక అవకాశాలు ఉంటాయన్న భావన వ్యక్తం అవుతోంది. ఇది కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు.

    Share post:

    More like this
    Related

    Kalki Movie Collections : కల్కి మూవీకి వారంలో 370 కోట్లు.. ఇంకా రావాల్సింది ఎంతంటే..?

    Kalki Movie Collections : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు...

    Kavitha : కవితకు జైలు నుంచి విముక్తి దొరకదా..?

    Kavitha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మూడు నెలల...

    CM Chandrababu : ఏపీవాసులకు శుభవార్త.. ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

    CM Chandrababu : ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    Mandhana-Shafali : సెంచరీలు చేసి చరిత్ర సృష్టించిన మంధాన-షఫాలీ.. దిగజారిన  దక్షిణాఫ్రికా  పరిస్థితి 

    Mandhana-Shafali : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : జెండా తో రోడ్డు పై నిలుచున్న చిన్నారి.. కాన్వాయ్ ఆపి ఆప్యాయంగా పలకరించిన పవన్

    Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన...

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...