![IPL 2024](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/22_02_2024-ipl2024datenews_2024222_174154.jpg)
IPL 2024 : 2024 ఐపీఎల్ 17 వ సీజన్ లో చాలా మంది ప్లేయర్లు తమ ప్రతిభ చాటుకున్నారు. ఈ సీజన్ లో అత్యధిక పరుగుల సాధించిన క్రికెటర్ గా డేరింగ్ అండ్ డాషింగ్ క్రికెటర్ విరాట్ నిలిచాడు. విరాట్ కొహ్లి 741 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ప్లే ఆప్స్ లో ఆ జట్టు వెనుదిరగడంతో ఆరెంజ్ క్యాప్ ను కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్నాడు.
బౌలింగ్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ జట్టు ప్లే ఆప్స్ చేరకుండానే 9 వ స్థానంలో నిలిచినా కూడా హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ గెలుచుకోవడం చూస్తే ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశాడో అర్థమవుతుంది.
సునీల్ నరైన్ ప్లేయర్ ఆప్ ది సిరీస్ గా నిలిచాడు. 17 వికెట్లు తీయడంతో పాటు 488 పరుగులు చేయడంతో సునీల్ నరైన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. సునీల్ నరైన్ 2012 డెబ్యూ సీజన్ లో 24 వికెట్లు తీయగా.. 2018 సీజన్ లో బ్యాటింగ్ లో357 పరుగులు 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో 488 పరుగులు చేసి 17 వికెట్లు తీయడంతో సునీల్ నరైన్ ను ప్లేయర్ ఆప్ ది సిరీస్ గా ఎంపిక చేశారు.
పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సొంతం చేసుకుంది.
హైదరాబాద్ యువ కెరటం నితీశ్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో యంగ్ ఎమర్జింగ్ ప్లేయర్ గా అవార్డు అందుకున్నారు.
ఫైనల్లో మ్యాచ్ గెలిచి ట్రోపీ సొంతం చేసుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ కు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీతో పాటు ట్రోపినీ ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ అందజేశారు. ఫైనల్ లో ఓడిపోయిన సన్ రైజర్స్ కు రూ. 12.50 కోట్ల చెక్కును కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు అందజేశారు.