26.8 C
India
Monday, July 1, 2024
More

    Cricket రెండో టీ20 మ్యాచ్ కు వారు ఔట్

    Date:

    Cricket
    Cricket
    Cricket : భారత్, వెస్టిండీస్ మధ్య గయానాలోని ప్రొవిడెన్స్‌లో రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. తొలి టీ20 మ్యాచ్‌లో విండీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో భారత్‌ను 0-1తో వెనక్కు నెట్టింది. ఇప్పుడు రెండో టీ20లో ప్లే-11కి సంబంధించి చర్చలు ప్రారంభమయ్యాయి. గయానా T20  ప్లేయర్స్ -11 నుంచి ఒకరు కాదు, ఏకంగా ముగ్గురిని పక్క పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
    4 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా  
    ట్రినిడాడ్లో గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. డాషింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా తొలి టీ20లో 150 పరుగుల లక్ష్యాన్ని చేధించలేపోయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకొని, 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా 9 వికెట్లకు 145 పరుగులతో ఓటమి పాలైంది.
    వీళ్లకు నో చాన్స్ 
    గయానాలో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో ముగ్గురిని పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇందులో ముందుగా ఉన్నది వెస్టిండీస్ క్రికెటర్ జాన్సన్ చార్లెస్. ట్రినిడాడ్ టీ20లో మూడో స్థానంలో దిగిన చార్లెస్ 3 పరుగులు మాత్రమే చేశాడు. అతడిని కుల్దీప్ యాదవ్ దారుణంగా అవుట్ చేశాడు. కేవలం 6 బంతులు మాత్రమే ఆడగలిగాడు. రెండో నంబర్ లో ఉన్నది అల్జారీ జోసెఫ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జోసెఫ్ అనుభవజ్ఞుడైన క్రికెటర్, కెప్టెన్ పావెల్ అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. జోసెఫ్ మొదటి T20 మ్యాచ్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో కెప్టెన్ పావెల్ అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉన్నది. జోసెఫ్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 9.8 ఎకానమీ రేటుతో 39 పరుగులు చేశాడు.
    కైల్ మేయర్స్ కూడా..
    ఓపెనర్ కైల్ మేయర్స్ కూడా విండీస్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లోని ఓపెనింగ్ టీ20 మ్యాచ్‌లో మేయర్స్ కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. మేయర్స్‌ను యుజ్వేంద్ర చాహల్ ఎల్‌బీడబ్ల్యూ అవుట్ చేశాడు. మేయర్స్‌కు 18 టెస్టులు, 28 వన్డేలు, 25 టీ20లు ఆడిన అనుభవం ఉంది. అతను టెస్టులు, వన్డేలలో రెండు సెంచరీలు చేశాడు. అయితే ఇదే పేలవమైన ఆట తీరు కొనసాగితే, అతను ప్లేయింగ్-11లో స్థానం కోసం పోటీని ఎదుర్కొక తప్పదు.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    5G Spectrum Auction : రెండు రోజుల్లోనే ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం

    5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్...

    Team India : కంగారెత్తించినా.. చివరకు విజయంతో సెమీస్ కు భారత్

    Team India : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో...

    T20 World Cup 2024 : సెమీ ఫైనల్ కు చేరు జట్లు ఇవే..

    T20 World Cup 2024  : టీ 20 ప్రపంచ కప్...