25.3 C
India
Tuesday, July 2, 2024
More

    Varshikotsava Celebrations : ఎడిసన్ న్యూజెర్సీ లో సాయిదత్త పీఠం శ్రీశివవిష్ణు టెంపుల్ 10వ వార్షిక ఉత్సవాలు ప్రారంభం

    Date:

    Sai Datta Peetham - Varshikotsava Celebrations
    Sai Datta Peetham – Varshikotsava Celebrations

    Varshikotsava Celebrations : భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక అమెరికాలోనూ వెల్లివిరుస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీలో   ‘శ్రీ సాయి దత్తపీఠం’ ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లుతోంది. ఈ పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ శివవిష్ణు దేవాలయం ఆవరణలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భక్తి కార్యక్రమాలు, భజనలు నిత్యం కొనసాగుతాయి. ఇందులో భాగంగా ‘ శ్రీ సాయి దత్తపీఠం 10వ వార్షికోత్సవ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు 9 రోజులు కొనసాగనున్నాయి.

    Sai Datta Peetham

    శనివారం (జూన్ 29) రోజున ఈ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ఉదయం 7 గంటలకు ‘కళాపోషన మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ’లో ఆధ్వర్యంలో భక్తి పాటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురువుగా శ్రీమతి జయశ్రీ రంగనాథ్ వ్యవహరించారు.

    ఆదివారం రెండో రోజున ‘ఆనందభైరవి’ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక గీతాల ఆలాపన కార్యక్రమంలో గురువులు శ్రీమతి భవాని ప్రకాశ్, శ్రీ ప్రకాశ్ రావు పాల్గొని స్వామి వారిని కొలుస్తూ కీర్తించారు.

    సోమవారం  ‘సురుషి సేవా గ్రూప్’ ఆధ్వర్యంలో శ్రీ రంతిక్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భక్తి పాటల ఆలాపన కొనసాగుతుంది. నాలుగో రోజు (జూలై 2) న్యూజెర్సీలోని ‘స్వరాలయ’ ఆధ్వర్యంలో గురువు శ్రీమతి శారదా కందవల్లి ఆధ్వర్యంలో సాగనున్నాయి. ఐదో రోజు (జూలై 3) సర్గన్ మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో భక్తి గీతా ఆలాపన కార్యక్రమం.. (జూలై 4-గురువారం) గోవింద పట్టాభిషేకం కథా గానాన్ని శ్రీమతి శ్రీదేవి అయ్యగారి ఆలపించనున్నారు.

    (జూలై 5) ‘కృష్ణవేణి స్కూల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్’ ఆధ్వర్యంలో శ్రీమతి వేమూరి విజయలలిత భక్తిగీతాలను ఆలపించనున్నారు.  ఆ తర్వాత 7.30 గంటలకు శశిభూషన్ మోచెర్ల గారి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక చివరి రోజు (జూలై 6) శ్రీ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో భజన, భక్తి గీతాల ఆలాపన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

    ఆరుపడైవీడు సుబ్రహణ్యస్వామి దేవాలయంలో విగ్రహాన్ని యూ బ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ యలమంచిలి గారు స్పాన్సర్ చేశారు. స్వామి వారి సేవలో ఆయన పాత్రులు అవుతున్నారు. .

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya TV & JSW Tv Global Director)

    More Images : 10th Anniversary of SDP SSV Temple Edison NJ PHOTOS

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cultural Workshop : తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో కల్చరల్ వర్క్ షాప్

    Cultural Workshop : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాలలో విస్తృతంగా చాటేందుకు...