32 C
India
Monday, June 17, 2024
More

    Collegium : ఎన్డీఏ ఈ సారి అధికారంలోకి రాగానే.. ‘కొలీజియం’ రద్దు చేస్తుందా?

    Date:

    Collegium
    Collegium

    Collegium : భారత్ లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థే మూలం. ఈ కొలీజియం వ్యవస్థలోని సీనియర్ న్యాయమూర్తులు, ప్రధాని, ప్రతిపక్ష నేత ముగ్గురు కలిసి న్యాయమూర్తుల నియామకం చేస్తారు. అయితే ఎన్డీయే మూడో సారి పవర్ లోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

    నేషనల్ డెమొక్రటిస్ అలియన్స్ (ఎన్‌డీఏ) కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయమూర్తుల (జడ్జిల) నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థ రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని రాష్ట్రీయ లోక్‌ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా ప్రకటించారు.

    బిహార్‌లోని కరకట్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఆదివారం ఆ నియోజకవర్గంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసి ప్రచారం నిర్వహించారు. 7వ దశ పోలింగ్ జూన్‌ 1న ఇక్కడ జరుగనుంది.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘కొలీజియం వ్యవస్థలో లోపాలున్నాయి. అదొక అప్రజాస్వామిక వ్యవస్థ. దళితులు, ఓబీసీలతోపాటు అగ్రవర్ణ పేదలకు ఉన్నత న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తిగా నియామకమయ్యే ద్వారాలను కొలీజియం మూసేసింది. సుప్రీం కోర్టు, హై కోర్టు ధర్మాసనాల న్యాయమూర్తులను మనం పరిశీలిస్తే.. కొన్ని వందల కుటుంబాల ఆధిపత్యం కనిపిస్తుంది’ అన్నారు.

    కొలీజియంకు ప్రత్యామ్నాయంగా ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ బిల్లు కొన్ని కారణాలతో సుప్రీంకోర్టు కొట్టివేసిందని, ‘కొలీజియం వ్యవస్థపై తూటా పేల్చే సాహసం కేవలం ఎన్డీయే మాత్రమే చేయగలిగింది’ అని ఆయన పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    CM Revanth : బస్టాండ్ లో కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు

    CM Revanth : కరీంనగర్ బస్టాండ్ లో గర్భిణికి కాన్పు చేసి...

    CM Chandrababu : పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక...

    Suicide : ప్రియుడి వద్దకు వెళ్లద్దన్నందుకు.. వివాహిత సూసైడ్..

    Suicide : ప్రస్తుత రోజుల్లో మూడు ముళ్ల బంధం అపహాస్యంగా మారుతోంది....

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related