26.1 C
India
Saturday, June 22, 2024
More

    Telangana MP Elections Results : తెలంగాణలో రెండంకెల స్కోర్ ఎవరికి..?

    Date:

    Telangana MP Elections Results
    Telangana MP Elections Results

    Telangana MP Elections Results : లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ జోరుగా సాగుతోంది. కేంద్రంలో ఎన్డీయే 290కి పైగా సీట్ల మెజారిటీతో దూసుకుపోతోంది. అయితే 220 సీట్లను ఇండీ కూటమి కూడా అందుకోగలిగింది. తెలంగాణలో ముగ్గురు నేతలు, వారి ప్రధాన మద్దతుదారులు చాలా నిశితంగా పలితాలను పరిశీలిస్తున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవదని, సున్నాకు పరిమితమవుతుందని, అదృష్టవంతులైతే ఒక్క సీటు దక్కవచ్చని చెప్పాయి.

    అయితే తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ లేదంటే బీజేపీ రెండంకెల స్థానాలు సాధిస్తాయా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏ పార్టీ రెండంకెల సీట్లు సాధిస్తే ఆ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా నిలిచే ఛాన్స్ ఉంది. ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ లోక్ సభ ఎన్నికలు కీలక రణరంగంగా కనిపిస్తున్నాయి.

    బీఆర్ఎస్ జీరోకు పరిమితమైనా, లేదంటే ఒక్క సీటు వచ్చినా మనుగడ సంక్షోభంలో పడ్డట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ రెండంకెల స్కోరుకు చేరితే అది కేసీఆర్, బీఆర్ఎస్ నేతల మనోస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు బీజేపీకి గేమ్ ఛేంజర్ అని, మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణలో పొలిటికల్ గేమ్ ను చూడబోతున్నాయని విశ్లేషకులు చెప్తుండగా.. బీఆర్ఎస్ కు మాత్రం అత్యంత దయనీయమైన ఎన్నికలుగా చెప్తున్నారు.

    పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ సొంత రాష్ట్రంపై ఇంతగా పట్టుకోల్పోతుందని ఎవరూ ఊహించలేదని, లోక్ సభలో ఎంఐఎం కంటే దిగజారిపోయిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    అయితే ఈ ఫలితాల్లో రెండెంకల స్కోర్ ఏ పార్టీకి రాకపోవచ్చని తెలుస్తోంది. సాయంత్రం వరకు ఆగితే తప్ప ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Trump Sensation : అమెరికాలో గ్రాడ్యూయేషన్ చేసిన వారికి గ్రీన్ కార్డ్.. ట్రంప్ సంచలనం

    Trump Sensation : యూఎస్ఏలోని కాలేజీలు, యూనివర్సిటీలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న...

    AP CEO : బాబు ఏపీ సీఎం కాదు.. సీఈవోనట..

    AP CEO : ఏపీ సీఎం చంద్రబాబుకు ముందు నుంచి టెక్నాలజీపై...

    Priyanka Gandhi : తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక.. ప్రచారానికి మమతా బెనర్జీ

    Priyanka Gandhi : రానున్న కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్...

    NEET : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నీట్ సెగ

    -  ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు NEET : కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rahul Gandhi : నీట్ రద్దు చేయాలి.. లీకేజీకి మోదీదే బాధ్యత: రాహుల్ గాంధీ

    Rahul Gandhi : నీట్ పరీక్షను రద్దు చేయాలని ఏఐసీసీ ప్రధాన...

    Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట.. బెయిల్ మంజూరు

    Rahul Gandhi : ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెంగళూరు...

    Jairam Ramesh : మణిపూర్ లో కాంగ్రెస్ విజయం.. మోదీకి చెంపపెట్టు: జైరాం రమేశ్

    Jairam Ramesh : లోక్ సభ ఎన్నికల్లో మణిపూర్ లోని రెండు...

    Kharge : పీఎం మోదీ మటన్, ముజ్రా, మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారు: ఖర్గే

    Kharge : పీఎం మోదీ మటన్, ముజ్రా, మంగళసూత్రం  గురించి మాట్లాడతారు...