41.5 C
India
Monday, May 27, 2024
More
    Home Blog Page 1528

    TRS- BRS- KCR : దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారా ?

    trs-brs-kcr-a-day
    kcr
    trs-brs-kcr-national-party-announcement-on-dussehra-day
    trs-brs-kcr-national-party-announcement-on-dussehra-day

    దసరా రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించారు కేసీఆర్. అక్టోబర్ 5 న దసరా పండుగ కావడంతో దసరా అంటే విజయదశమి ……. విజయదశమి విజయాలకు చిహ్నం కాబట్టి ఆరోజున జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 

    ఇప్పటికే పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక దసరా రోజున అంటే అక్టోబర్ 5 న హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లుగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. దసరా రోజున సమావేశంలో పలు అంశాలపై చర్చించిన తర్వాత జాతీయ పార్టీ BRS ను ప్రకటించనున్నారట. కేసీఆర్ సెంటిమెంట్ 6. అలాగే తెలంగాణలో శాసన స్థానాల సంఖ్య 119 కావడంతో అక్టోబర్ 5 న మధ్యాహ్నం 1.05 నిమిషాలకు కానీ లేదంటే 1. 19 నిమిషాలకు ఈ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

    HERO MAHESH BABU MOTHER INDIRA DEVI IS NO MORE: హీరో మహేష్ బాబు తల్లి మృతి

    hero-mahesh-babu-mother-indira-devi-is-no-more-hero-mahesh-babus-mother-passed-away
    hero-mahesh-babu-mother-indira-devi-is-no-more-hero-mahesh-babus-mother-passed-away
    hero-mahesh-babu-mother-indira-devi-is-no-more-hero-mahesh-babus-mother-passed-away
    hero-mahesh-babu-mother-indira-devi-is-no-more-hero-mahesh-babus-mother-passed-away

    సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. హీరో కృష్ణ భార్య , హీరో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో మరణించారు. తల్లి మరణంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు. కొన్నాళ్ల క్రితమే అన్న రమేష్ బాబు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధ నుండి ఇంకా కోలుకోకముందే తల్లి మరణించడంతో మహేష్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 

    మహేష్ బాబుకు తల్లి ఇందిర అంటే చాలా చాలా ఇష్టం. ఆమెను తన సినిమా ఫంక్షన్ లకు తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేసారు మొదట్లో. అయితే ఆమెకు ఫంక్షన్లలో వచ్చే ఇష్టం లేకపోవడంతో ఇందిరాదేవి గురించి పెద్దగా జనాలకు తెలియలేదు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి ఈరోజు మరణించడంతో పద్మాలయా స్టూడియోస్ లో కొద్దిసేపు ఆమె పార్దీవ దేహాన్ని అభిమానుల సందర్శరార్థం ఉంచి ఈరోజునే అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు సమాచారం.

    జగన్ ప్రభుత్వం పై బీజేపీ పోరు యాత్ర

    bjp-campaign-against-jagan-government
    bjp-campaign-against-jagan-government
    bjp-campaign-against-jagan-government
    bjp-campaign-against-jagan-government

    ఏపీలో జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని దాంతో ప్రజా పోరు యాత్ర చేపట్టామని అంటోంది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రజా పోరు యాత్ర చేపట్టగా 9 వ రోజున గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ పాతురి నాగభూషణం, గుంటూరు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, బిట్ర శివ నారాయణ , కోలా ఆనంద్, శ్రీనివాస్, నాగేంద్రం తదితర నాయకులతో పాటుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

    ఇందిరా దేవికి నివాళులు అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు

    SDP SSV Temple Navarathri Celebrations 1st Day Photos by Dr. Shiva Kumar Anand

    Bathukamma Celebrations in New Jersey Photos by Dr. Shiva Kumar Anand

    Bathukamma Celebrations in New Jersey Photos by Dr. Shiva Kumar Anand

    ‘నాన్నంటే’ చిత్రం పోస్టర్, ట్రైలర్ లాంచ్

    nannante-movie-poster-trailer-launch
    nannante-movie-poster-trailer-launch
    nannante-movie-poster-trailer-launch
    nannante-movie-poster-trailer-launch

    ఏఆర్ ఫిల్మ్ బ్యానర్ పై, నాగేశ్వర్ సమర్పణలో, నంది వెంకట్ రెడ్డి దర్శకత్వంలో, అశోక్ రెడ్డి లెంకల నిర్మించిన చిత్రం ‘నాన్నంటే’. YSK ,(వై ఎస్ కె ) ,నిహరిక చౌదరి , వరేణ్య ఆగ్రా , అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు ,వి.కరుణాకర్ ప్ర‌ధాన‌ పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 14న థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ లంచ్ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగింది.

    చింతలూరు నాగరాజ్ ‘నాన్నంటే’ చిత్రం పోస్టర్ లాంచ్ చేశారు. నటుడు, నిర్మాత కుప్పిలి శ్రీనివాస్ ట్రైలర్ లాంచ్ చేశారు. నటుడు గబ్బర్ సింగ్ సాయి రెండో ట్రైలర్ లాంచ్ చేశారు. నటుడు భాషా చిత్ర ఫ్లెక్సీ ఆవిష్కరించారు.

    గబ్బర్ సింగ్ సాయి, నాగరాజ్, భాషా, నటుడు ఆర్పీ మాట్లాడుతూ.. బంధాలు, అనుబంధాలు ఆవిష్కరించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని అన్నారు. ఇలాంటి సినిమాలకు అందరు సపోర్ట్ చేయాలని కోరారు.

    కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ… నాన్న గొప్పదనాన్ని ఈ చిత్రం గొప్పగా చెప్పిందని, పిల్లలకు మంచి మెసేజ్ ఇస్తుందని అన్నారు. శివ సాంగ్ చాలా బాగుందన్నారు.

     నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ… నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలని కోరారు. కోట శంకర్ రావు మాట్లాడుతూ… ప్రొడ్యూసర్ తనకు మంచి పాత్ర ఇచ్చారని, మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఆదరించాలని కోరారు. 

    న‌టీన‌టులు : YSK ,(వై ఎస్ కె ) , నిహరిక చౌదరి , వరేణ్య ఆగ్రా లంకెల అశోక్ రెడ్డి ,కోట శంకర్ రావు,తోట సుబ్బారావు ,వి.కరుణాకర్ ,మంచికంటి వేంకటేశ్వర్లు (M. V. P) ,దుర్గా ప్రసాద్ ,తన్నీరు నాగేశ్వర్ ,ఎన్. విజయలక్ష్మి, ఎ. విజయ ,అంబికా, ఏ.పూజిత రెడ్డి ,మాస్టర్ ఆషు , లక్ష్మీ రామ్ ,

    మ్యూజిక్ : డ్రమ్స్ రామ్ 

    DOP: డి. యాదగిరి

    నిర్మాత : లంకెల అశోక్ రెడ్డి

    క‌థ – స్రీన్ ప్లే – ద‌ర్శ‌క‌త్వం : నంది వెంక‌ట్ రెడ్డి

    పి.ఆర్.ఓ : దయ్యాల అశోక్.

    MIMICRY MURTHY PASSED AWAY: విషాదం : జబర్దస్త్ కమెడియన్ మృతి

    mimicry-murthy-passed-away-tragedy-jabardast-comedian-passed-away
    mimicry-murthy-passed-away-tragedy-jabardast-comedian-passed-away
    mimicry-murthy-passed-away-tragedy-jabardast-comedian-passed-away
    mimicry-murthy-passed-away-tragedy-jabardast-comedian-passed-away

    చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. జబర్దస్త్ కమెడియన్ మూర్తి ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు మూర్తి. క్యాన్సర్ తో బాధపడుతున్న మూర్తి చికిత్స కోసం ఏకంగా 16 లక్షలు ఖర్చు చేసారు. కొంతమంది సినీ ప్రముఖులు కూడా కొంత విరాళాలు ఇచ్చారు.

    అయితే క్యాన్సర్ తీవ్రత ఎక్కువ కావడంతో ఈరోజు ( సెప్టెంబర్ 27, 2022) న మరణించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు వెల్లడించారు. మూర్తి మంచి మిమిక్రి ఆర్టిస్ట్ కూడా పలు వేదికలపై మిమిక్రీతో అలరించారు. అంతేకాదు జెమిని ఛానల్ లో కొన్నాళ్ల పాటు యాంకర్ గా కూడా చేసారు.

    ఆ తర్వాత జబర్దస్త్ షోకు వచ్చారు. జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు …… ప్రేక్షకులను అలరించారు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న వేషాలు వేశారు.  మిమిక్రీ మూర్తి మరణవార్త తెలిసిన పలువురు జబర్దస్త్ కమెడియన్లు మూర్తి మరణం పట్ల తీవ్ర విచారం వెలిబుచ్చారు.

    ADIPURUSH- PRABHAS- ADIPURUSH TEASER: అక్టోబర్ 2 న ఆదిపురుష్ టీజర్

    adipurush-prabhas-adipurush-teaser-adipurush-teaser-on-2nd-october
    adipurush-prabhas-adipurush-teaser-adipurush-teaser-on-2nd-october
    adipurush-prabhas-adipurush-teaser-adipurush-teaser-on-2nd-october
    adipurush-prabhas-adipurush-teaser-adipurush-teaser-on-2nd-october

    ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకులు ఓం రౌత్. అక్టోబర్ 2 న అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా దర్శకులు ఓం రౌత్ ప్రకటించారు. దాంతో ప్రభాస్ అభిమానుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. చాలాకాలంగా ఆదిపురుష్ నుండి అప్ డేట్ కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

    అయితే వాళ్ళు ఎన్నిసార్లు డిమాండ్ చేసినప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం పట్టించుకోలేదు. దాంతో పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేసారు. చాలా రోజులుగా ప్రభాస్ సినిమాల నుండి అప్ డేట్ కోరుతున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పారు. దాంతో అక్టోబర్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 2 న ఆదిపురుష్ టీజర్ రానుంది. అలాగే వచ్చే ఏడాది జనవరి 12 న సినిమా విడుదల కానుంది.

    ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించగా సీతగా కృతి సనన్ నటించింది. రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఇక మిగిలిన పాత్రల్లో దేవ్ దత్తా , సన్నీ సింగ్ , తృప్తి తదితరులు నటించారు. గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యమైంది. మొత్తానికి డార్లింగ్ ఫ్యాన్స్ కోరిక నెరవేరి టీజర్ కు సిద్ధమైంది. మరో మూడు నెలలు గడిస్తే ఆదిపురుష్ విడుదల కానుంది. 

    VETERAN STAR ASHA PAREKH : సీనియర్ నటి ఆశా పరేఖ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

    veteran-star-asha-parekh-dadasaheb-phalke-award-to-senior-actress-asha-parekh
    veteran-star-asha-parekh-dadasaheb-phalke-award-to-senior-actress-asha-parekh
    veteran-star-asha-parekh-dadasaheb-phalke-award-to-senior-actress-asha-parekh
    veteran-star-asha-parekh-dadasaheb-phalke-award-to-senior-actress-asha-parekh

    సీనియర్ నటి ఆశా పరేఖ్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. 1960 – 70 వ దశకంలో భారత్ లో తిరుగులేని స్టార్ గా వెలుగొందింది ఆశా పరేఖ్. భారత్ లో అత్యధిక పారితోషకం అందుకున్న నటిగా ఖ్యాతి గాంచింది అప్పట్లో. బాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన ఈ సీనియర్ నటికి ఇన్నాళ్లకు ప్రభుత్వ గౌరవం దక్కింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కడంతో ఆశా పరేఖ్  చాలా సంతోషంగా ఉంది. 

    దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కడం పట్ల ఆశా కుటుంబం కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు తగిన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు పలువురు. ఆశా పరేఖ్ నటిగానే కాకుండా నిర్మాతగా , దర్శకురాలిగా సత్తా చాటింది. తన అభిరుచి మేరకు పలు చిత్రాలను నిర్మించింది అలాగే దర్శకత్వం కూడా వహించింది. వెటరన్ నటి ని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ కు ఎంపిక చేయడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆశా పరేఖ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.