32 C
India
Monday, June 17, 2024
More
    Home Blog Page 1588

    LIGER-TAMMAREDDY BHARADWAJA: లైగర్ ప్లాప్  పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి

    liger-tammareddy-bharadwaja-tammareddy-made-sensational-comments-on-liger-plop
    liger-tammareddy-bharadwaja-tammareddy-made-sensational-comments-on-liger-plop
    liger-tammareddy-bharadwaja-tammareddy-made-sensational-comments-on-liger-plop
    liger-tammareddy-bharadwaja-tammareddy-made-sensational-comments-on-liger-plop

    విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ భారీ అంచనాల మధ్య విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 25 న విడుదలైన ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆ సినిమాని కొన్న బయ్యర్లు ఏకంగా 90 కోట్లకు పైగా నష్టపోయారు. ఇక ఇదే సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

    లైగర్ ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలనిపించలేదు అందుకే సినిమా విడుదలయ్యాక చూడలేదు …….. భవిష్యత్ లో సినిమా చూడాలని అనుకుంటే తప్ప ఆ సినిమాని చూడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ఓవర్ గా చేస్తే ఇలాగే ఉంటుంది. ప్రతీ యాక్షన్ కు రియాక్షన్ కూడా ఉంటుంది అది అర్ధం చేసుకొని సినిమా తీయాలి అంటూ చురకలు అంటించాడు తమ్మారెడ్డి భరద్వాజ.

    పూరీ జగన్నాథ్ చిత్రాలు సహజంగానే చూస్తుంటాను , అతడు బాగా తీస్తాడు కూడా కానీ లైగర్ టీజర్ , ట్రైలర్ చూసినప్పుడే ఇది ఆడే సినిమా కాదని అర్థమైపోయిందన్నాడు. అలాగే బాయ్ కాట్ ట్రెండ్ అయ్యేలా చేసేవాళ్ళు పెద్దగా సినిమాలు చూస్తారని అనుకోను …… వాళ్ళ వల్ల సినిమాలకు వచ్చే నష్టం ఏమి లేదు. సినిమా బాగుంటే కొత్తవాళ్ళైనా సరే ప్రేక్షకులు  చూస్తారు అందుకు ఉదాహరణగా బోలెడు సినిమాలు ఉన్నాయన్నారు తమ్మారెడ్డి. అంటే విజయ్ దేవరకొండ ఓవర్ యాక్షన్ చేసాడు ……. అందుకే సినిమా దొబ్బింది అని చెబుతున్నాడన్న మాట. 

    NIKKI TAMBOLI: శారీలో పిచ్చెక్కించిన నిక్కీ తంబోలి

    nikki-tamboli-nikki-tamboli-is-crazy-in-sari
    nikki-tamboli-nikki-tamboli-is-crazy-in-sari
    nikki-tamboli-nikki-tamboli-is-crazy-in-sari
    nikki-tamboli-nikki-tamboli-is-crazy-in-sari

    హాట్ భామ నిక్కీ తంబోలి చీరలో పిచ్చెక్కించింది. అసలు ఆ చీర ఉన్నట్లా ? లేనట్లా ? అనే ప్రశ్న ఉదయించక మానదు నిక్కీ తక్కుకున్న చీర చూసాక. పై భాగంలో ఓ బ్రా మాత్రం వేసుకొని కిందిభాగంలో ఓ వస్త్రాన్ని మాత్రం అడ్డుగా చుట్టుకుంది అంతే. అయితే అందులోంచి ఏవి కనబడాలో వాటిని చూపిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది.

    శృంగార కథానాయికగా పేరుగాంచిన ఈ భామ ఎక్స్ పోజింగ్ లో ఏమాత్రం అడ్డు చెప్పడమే లేదు. పాత్ర డిమాండ్ చేయాలే కానీ ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికైనా వెనుకాడేది లేదని దర్శక నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ఇస్తోంది. ఎక్స్ పోజింగ్ లోనే కాదు శృంగార సన్నివేశాల్లో కూడా నటించడానికి అభ్యంతరం లేదని చెప్పడమే కాకుండా పలు చిత్రాల్లో అలాంటి సన్నివేశాల్లో నటించి తన సత్తా చాటింది.

    అయితే ఈ భామ ఎంతగా రెచ్చిపోతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం దక్కడం లేదనే చెప్పాలి. తాజాగా చీరలో సింగారాలు ఆరబోస్తూ పిచ్చెక్కించింది. నిక్కీ తంబోలి అందాలను చూస్తూ ఊహాలోకాల్లో తేలిపోతున్నారు కుర్రాళ్ళు , ముసలి వాళ్ళు సైతం. ఈ అందాల ఆరబోత అయినా నిక్కీ కి మరిన్ని అవకాశాలను తెచ్చి పెడుతుందో ? లేదో ? చూడాలి. 

    NBK- NANDAMURI BALAKRISHNA: టర్కీలో హల్చల్ చేస్తున్న బాలయ్య

    nbk-nandamuri-balakrishna-balayya-who-is-making-waves-in-turkey
    nbk-nandamuri-balakrishna-balayya-who-is-making-waves-in-turkey
    nbk-nandamuri-balakrishna-balayya-who-is-making-waves-in-turkey
    nbk-nandamuri-balakrishna-balayya-who-is-making-waves-in-turkey

    నటసింహం నందమూరి బాలకృష్ణ టర్కీలో హల్చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య టర్కీలో ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం టర్కీ వెళ్ళాడు బాలయ్య. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ అందాల భామ కూడా టర్కీ వెళ్ళింది. అక్కడ బాలయ్య – శృతి హాసన్ లపై పాట చిత్రీకరిస్తున్నారు.

    ఇక షూటింగ్ మధ్యలో బాలయ్య టర్కీలో సందడి చేసాడు. ఓ ముస్లిం కుటుంబంతో కలిసి భోజనం చేసి వాళ్లకు సంతోషాన్ని అందించాడు. అంతేకాదు సీరియల్ లపై టీవీ లపై కామెంట్స్ చేసి మరింత సంచలనం సృష్టించాడు. పనిపాట లేని వాళ్ళు కొందరు టీవీలలో సీరియల్స్ చూస్తూ బుర్ర పాడు చేసుకుంటున్నారు. అదేపనిగా టీవీ చూసినా కూడా కళ్ళకు ఇబ్బందే అంటూ చురకలు అంటించాడు బాలయ్య.

    అయితే బాలయ్య ఇలా మాట్లాడుతున్న సమయంలో వీడియో తీశారు ఒకరు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. బాలయ్య లాంటి స్టార్ హీరో ఇలా సాధారణ వ్యక్తిలా ఓ ముస్లిం కుటుంబంతో కలిసి పోవడం వాళ్ళని షాక్ అయ్యేలా చేసిందని అంటున్నారు. అయితే  వాళ్ళని మాత్రమే కాదు నెటిజన్లను కూడా షాక్ అయ్యేలా చేస్తోంది ఆ వీడియో. 

    PAWAN KALYAN- CHIRANJEEVI :పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి

    pawan-kalyan-chiranjeevi-chiranjeevi-said-birthday-wishes-to-pawan-kalyan
    pawan-kalyan-chiranjeevi-chiranjeevi-said-birthday-wishes-to-pawan-kalyan
    pawan-kalyan-chiranjeevi-chiranjeevi-said-birthday-wishes-to-pawan-kalyan
    pawan-kalyan-chiranjeevi-chiranjeevi-said-birthday-wishes-to-pawan-kalyan

    తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి . నిన్న రాత్రి హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా సెప్టెంబర్ 2 న విడుదల అవుతుండటంతో అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ అభిమానులను ఉద్దేశించి తెలిపారు చిరు.

    దాంతో ఒక్కసారిగా మెగా అభిమానులు ఈలలు , గోలలతో హాల్ హాలంతా దద్దరిల్లేలా అరిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యువతలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక మెగా ఫంక్షన్ ఏదైనా సరే అక్కడ పవర్ స్టార్ …… పవర్ స్టార్ అంటూ నానా హంగామా చేస్తారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

    RISHI SUNAK: బ్రిటన్ లో అద్భుతం జరుగుతుందా ?

    rishi-sunak-will-a-miracle-happen-in-britain
    rishi-sunak-will-a-miracle-happen-in-britain

    rishi-sunak-will-a-miracle-happen-in-britain
    rishi-sunak-will-a-miracle-happen-in-britain

    బ్రిటన్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టలేడు……. ఎందుకంటే ఇప్పటికే బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరు అనేది తేలిపోయింది. బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బ్రిటన్ ప్రధాని పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5 న బ్రిటన్ కు కాబోయే ప్రధాని ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    అయితే బ్రిటన్ ప్రధాని పదవి కోసం పలువురు పోటీ పడినప్పటికీ పోటీ మాత్రం ఇద్దరి మద్యే నెలకొంది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు అలాగే బ్రిటన్ మహిళ లిజ్ ట్రస్ మధ్య మాత్రమే పోటీ నెలకొంది. మొదట్లో రిషి సునాక్ జోరు ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాత రేసులో అనూహ్యంగా లిజ్ ట్రస్ ముందంజలో నిలిచింది. దాదాపుగా లిజ్ ట్రస్ గెలుపు ఖాయమైపోయింది. కాకపోతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే తప్పకుండా భారత సంతతికి చెందిన రిషి సునాక్ విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. మరి ఆ అద్భుతం జరుగుతుందా ? కన్జర్వేటర్స్ రిషి సునాక్ కు అండగా నిలబడతారా ? చూడాలి.

    Major Movie Stills

    Major Telugu Movie Stills (1)

    SONIA GANDHI: సోనియా గాంధీ ఇంట తీవ్ర విషాదం

    sonia-gandhi-sonia-gandhis-house-is-a-tragedy
    sonia-gandhi-sonia-gandhis-house-is-a-tragedy

    sonia-gandhi-sonia-gandhis-house-is-a-tragedy
    sonia-gandhi-sonia-gandhis-house-is-a-tragedy

    కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సోనియా గాంధీ తల్లి పోలా మైనో ఆగస్టు 27 న ఇటలీలో మరణించింది. తల్లి మరణించిందన్న వార్త సోనియా గాంధీని తీవ్ర దుఃఖసాగరంలో ముంచింది. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే సోనియాగాంధీ ఇటలీ వెళ్ళింది.

    సోనియా తల్లి అంత్యక్రియలు నిన్న ఇటలీలో జరిగాయి. అయితే ఈ విషయాలను ఈరోజు వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ తల్లి చనిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ కాస్త ఆలస్యంగా ఈ విషయాలను మీడియాకు వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ. తల్లి మరణించడంతో కొద్దిరోజుల పాటు సోనియా గాంధీ ఇటలీలోనే ఉండనుంది. 

    సాయి దత్త పీఠంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

    grand-vinayaka-chavithi-celebrations-at-sai-dutta-peetha
    grand-vinayaka-chavithi-celebrations-at-sai-dutta-peetha

    grand-vinayaka-chavithi-celebrations-at-sai-dutta-peetha
    grand-vinayaka-chavithi-celebrations-at-sai-dutta-peetha

    అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్ లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని పూజ కావడంతో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఎడిసన్ లోని సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్ లో వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో JSW & JaiSwaraajya అధినేత UBlood ఫౌండర్ జగదీష్ యలమంచిలి , సాయి దత్త పీఠం చైర్మన్ రఘు శర్మ , JSW & JaiSwaraajya డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

    ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్

    TDP- BJP: టీడీపీ – బీజేపీ పొత్తు ఖాయమైందట

    tdp-bjp-tdp-bjp-alliance-is-confirmed
    tdp-bjp
    tdp-bjp-tdp-bjp-alliance-is-confirmed
    tdp-bjp-tdp-bjp-alliance-is-confirmed

    2024 లో భారత పార్లమెంట్ కు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో టీడీపీ – బీజేపీ పొత్తు ఖాయమైందని జాతీయ మీడియా సంస్థల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ ప్రచారంపై అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ఖండించలేదు దాంతో పొత్తు ఖాయమనే భావిస్తున్నారు. గతంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టగా అప్పట్లో ఎన్డీయే కన్వీనర్ గా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. 

    ఆ తర్వాత 2014 లో కూడా బీజేపీ – టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టింది. కట్ చేస్తే 2018 లో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదని మోడీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కి గుడ్ బై చెప్పాడు చంద్రబాబు. అంతేకాదు మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలను ఒక్కతాటి పైకి తీసుకొచ్చాడు చంద్రబాబు. అయితే 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు అధికారం కోల్పోయాడు. దాంతో ఇక చంద్రబాబు, మోడీ కలిసే అవకాశం లేదని అనుకున్నారు. 

    కట్ చేస్తే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు , శాశ్వత మిత్రులు ఉండరని మరోసారి చాటి చెప్పనున్నారు మోడీ – చంద్రబాబు. ఎన్డీయే పక్షం నుండి పలు పార్టీలు బయటకు వెళుతుండటంతో కాస్త కలవరపడిన బీజేపీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఏపీలో టీడీపీ తో పొత్తు పెట్టుకుంటేనే మంచిదనే నిర్ణయానికి వచ్చారట బీజేపీ కేంద్ర నాయకులు. త్వరలోనే ఈ పొత్తు పై అధికారిక ప్రకటన రావడం ఖాయమని తెలుస్తోంది.

    SUMAN: సుమన్ చనిపోయాడంటూ గాలి వార్తలు : రగిలిపోయిన సుమన్

    suman-suman-is-dead-on-the-air-suman-is-furious
    suman-suman-is-dead-on-the-air-suman-is-furious
    suman-suman-is-dead-on-the-air-suman-is-furious
    suman-suman-is-dead-on-the-air-suman-is-furious

    80- 90 వ దశకంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హీరో సుమన్ ఆవేశంతో రగిలిపోతున్నాడు. కామ్ గా ఉండే సుమన్ ఇంతగా ఆవేశంతో రగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా …… సుమన్ తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడంటూ ఉత్తరాదికి చెందిన యూట్యూబ్ ఛానల్స్ లో ఏకంగా ప్రోగ్రామ్స్ చేయడమే.

    తాను హాయిగా ఆరోగ్యంగా ఉంటె చనిపోయానంటూ ప్రోగ్రాం ఎలా చేస్తారు అంటూ ఆవేశంతో ఊగిపోతున్నాడు సుమన్. తనని ఇంతగా అవమానించిన ఆ యూట్యూబ్ ఛానల్స్ ని క్షమించేది లేదని , తప్పకుండా లీగల్ గా వాళ్లపై చర్యలు తీసుకుంటానని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

    ఇటీవల పలు యూట్యూబ్ ఛానల్స్ తమ లైక్స్ కోసం , వ్యూస్ కోసం బాగున్న సెలబ్రిటీలను చనిపోయాడంటూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అలాంటి ఛానల్స్ చాలానే ఉన్నాయి. దాంతో ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ వల్ల పలువురు సెలబ్రిటీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా కూడా నలిగి పోతున్నారు.