కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సోనియా గాంధీ తల్లి పోలా మైనో ఆగస్టు 27 న ఇటలీలో మరణించింది. తల్లి మరణించిందన్న వార్త సోనియా గాంధీని తీవ్ర దుఃఖసాగరంలో ముంచింది. తల్లి మరణవార్త తెలిసిన వెంటనే సోనియాగాంధీ ఇటలీ వెళ్ళింది.
సోనియా తల్లి అంత్యక్రియలు నిన్న ఇటలీలో జరిగాయి. అయితే ఈ విషయాలను ఈరోజు వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ తల్లి చనిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ కాస్త ఆలస్యంగా ఈ విషయాలను మీడియాకు వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ. తల్లి మరణించడంతో కొద్దిరోజుల పాటు సోనియా గాంధీ ఇటలీలోనే ఉండనుంది.