విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ భారీ అంచనాల మధ్య విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 25 న విడుదలైన ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆ సినిమాని కొన్న బయ్యర్లు ఏకంగా 90 కోట్లకు పైగా నష్టపోయారు. ఇక ఇదే సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.
లైగర్ ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలనిపించలేదు అందుకే సినిమా విడుదలయ్యాక చూడలేదు …….. భవిష్యత్ లో సినిమా చూడాలని అనుకుంటే తప్ప ఆ సినిమాని చూడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ఓవర్ గా చేస్తే ఇలాగే ఉంటుంది. ప్రతీ యాక్షన్ కు రియాక్షన్ కూడా ఉంటుంది అది అర్ధం చేసుకొని సినిమా తీయాలి అంటూ చురకలు అంటించాడు తమ్మారెడ్డి భరద్వాజ.
పూరీ జగన్నాథ్ చిత్రాలు సహజంగానే చూస్తుంటాను , అతడు బాగా తీస్తాడు కూడా కానీ లైగర్ టీజర్ , ట్రైలర్ చూసినప్పుడే ఇది ఆడే సినిమా కాదని అర్థమైపోయిందన్నాడు. అలాగే బాయ్ కాట్ ట్రెండ్ అయ్యేలా చేసేవాళ్ళు పెద్దగా సినిమాలు చూస్తారని అనుకోను …… వాళ్ళ వల్ల సినిమాలకు వచ్చే నష్టం ఏమి లేదు. సినిమా బాగుంటే కొత్తవాళ్ళైనా సరే ప్రేక్షకులు చూస్తారు అందుకు ఉదాహరణగా బోలెడు సినిమాలు ఉన్నాయన్నారు తమ్మారెడ్డి. అంటే విజయ్ దేవరకొండ ఓవర్ యాక్షన్ చేసాడు ……. అందుకే సినిమా దొబ్బింది అని చెబుతున్నాడన్న మాట.
Breaking News