ఏపీలో జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని దాంతో ప్రజా పోరు యాత్ర చేపట్టామని అంటోంది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రజా పోరు యాత్ర చేపట్టగా 9 వ రోజున గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ పాతురి నాగభూషణం, గుంటూరు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, బిట్ర శివ నారాయణ , కోలా ఆనంద్, శ్రీనివాస్, నాగేంద్రం తదితర నాయకులతో పాటుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
Breaking News