Jagan Government :
ఏపీలో రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి జగన్ సర్కారు వ్యవహరిస్తున్నదని గతంలో ఎన్నోసార్లు టీడీపీ ఆరోపణలు చేసింది. పోలవరం సహా ఎన్నో విషయాల్లోనూ జగన్ తీరు ప్రజలకు నష్టం చేసేలా ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీటి వినియోగం పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కృష్ణా ట్రిబ్యునల్ కొట్టివేసింది. 90 టీఎంసీల నీటిని వాడుకోకుండా తెలంగాణను అడ్డుకోవాలని ఏపీ ఇంటర్ లోకేటరీ వేసిన అప్లికేషన్ పై విచారణ అధికారం తమకు లేదని కృష్ణా ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
2022 ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇచ్చిన జీవో 246 పై స్టే ఇవ్వాలని ఏపీ సర్కారు పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు జూలై 14 వరకు జరిగాయి. అయితే ఈ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది ఉత్తర్వులు జారీ చేసింది.దీనిపై అధికారం తమకు లేదని, తగిన వేదికలపై తేల్చుకోవాలని చెప్పింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఈ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా జగన్ దీక్ష చేశాడు. రాయలసీమకు నష్టం జరుగుతుందని హడావుడి చేశాడు. ఇప్పుడు దాని గురించి పట్టించుకున్న సందర్భాలు లేవు. ఇప్పుడు తెలంగాణ ఆ ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని వాడుకునేందుకు సిద్ధమైంది. కానీ దీనపై జగన్ ఏ ఒక్క మాట మాట్లాడడు.
ఇక శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిలో 90 టీఎంసీలను ఎత్తి పోసుకోవడానికి తెలంగాణకు అవకాశం దక్కింది. ప్రస్తుతం ప్రాజెక్టులో అతి తక్కువ నీరు మాత్రమే ఉంది. అది కూడా తెలంగాణ రాష్ర్టం ఎత్తి పోసుకుంటే ఇక రాయలసీమకు కన్నీరే మిగులుతుందనే అభిప్రాయం ఆ ప్రాంత రైతుల నుంచి వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో జగన్ సర్కారు పట్టనట్లు వ్యవహరించడంపై మండిపడుతున్నారు. రాష్ర్టానికి జగన్ వచ్చాకే అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నదని, గతంలో చంద్రబాబు హయాంలో ఏదో జరిగిపోతుందని ఆందోళనలు చేసినా, జగన్ ఇప్పుడు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు. తన కేసుల కోసం రాష్ర్ట ప్రయోజనాలను పక్కన పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రతిపక్షాలపై వేధింపులకే ఆయనకు సమయం సరిపోతున్నదని, ఇక రైతుల బాధలు ఏం చూస్తాడని ధ్వజమెత్తుతున్నారు. ఏదేమైనా ఏపీ సర్కారు తీరు ఇప్పుడు రాయలసీమ రైతులకు ఇబ్బందికరంగా మారింది.