Elon Musk : భవిష్యత్తులో మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చునని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్ ప్రపంచంలో కృత్రిమ మేధ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనలు ఆసక్తి రేకెత్తిస్తున్నా.. మరోవైపు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్యారిస్ కేంద్రంగా ‘వివా టెక్’ పేరిట నిర్వహించిన స్టార్టప్ సదస్సులో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
రాబోయే రోజుల్లో ఉద్యోగం చేయడం ఒక వ్యాపకంగా మారుతుందని అన్నారు. అన్ని ఉత్పత్తులు, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని అంచనా వేశారు. అదే జరిగితే మనెవ్వరికీ జాబ్స్ ఉండకపోవచ్చునని వివరించారు. అయితే, ఆ స్థితికి చేరుకోవడానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ‘యూనివర్సల్ హై ఇన్ కమ్’ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పరోక్షంగా అందరికీ పెద్ద మొత్తంలో ఆదాయం ఉండాలని సూచించారు.