31.1 C
India
Wednesday, June 26, 2024
More
    Home Blog Page 1587

    AKKINENI NAGESHWARA RAO:ANR LIVES ON

    AKKINENI NAGESHWARA RAO ANR LIVES ON
    AKKINENI NAGESHWARA RAO ANR LIVES ON
    AKKINENI NAGESHWARA RAO ANR LIVES ON
    AKKINENI NAGESHWARA RAO ANR LIVES ON

    మహానటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి ఈరోజు. 1923 సెప్టెంబర్ 20 న కృష్ణా జిల్లా రామాపురం అనే గ్రామంలో అక్కినేని వెంకట రత్నం – పున్నమ్మ దంపతులకు జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు. పేద కుటుంబంలో జన్మించడంతో చదువు పెద్దగా చదువుకోలేకపోయారు. అయితే నాటకాలలో మాత్రం బాగా రాణించారు. ముఖ్యంగా మహిళా వేషధారణలో అదరగొట్టారు అక్కినేని. ఆ తర్వాత సినిమారంగంలోకి అడుగుపెట్టి అగ్ర కథానాయకుడిగా అప్రతిహతమైన విజయాలను అందుకున్నారు.

    అక్కినేని స్టార్ గా వెలుగొందుతున్న సమయంలోనే నందమూరి తారకరామారావు చిత్ర రంగప్రవేశం చేసారు. ఎన్టీఆర్ ఆజానుబాహుడు దాంతో మరొక హీరో అయితే కృంగిపోయేవారు అనే చెప్పాలి. కానీ అక్కినేని మాత్రం ఛాలెంజ్ గా తీసుకొని తన బలం – బలహీనత ఏంటో తెలుసుకొని అలాంటి చిత్రాలను మాత్రమే చేసి తిరుగులేని ప్రజాధారణ పొందారు.

    ఎన్టీఆర్ చారిత్రాత్మక , పౌరాణిక చిత్రాలతో సంచలనం సృష్టిస్తుంటే అక్కినేని మాత్రం జానపద , సాంఘిక చిత్రాలతో ప్రభంజనం సృష్టించారు. ముఖ్యంగా 60- 70 వ దశకంలో సాంఘిక చిత్రాలతో అప్పటి యువతలో విపరీతమైన పాపులారిటీ సంపాదించారు అక్కినేని. ఇక ప్రేమ కథా చిత్రాలకు , విషాద భరితమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. 75 సంవత్సరాల పాటు నటననే వృత్తిగా సాగించిన మహనీయుడు అక్కినేని. క్యాన్సర్ తో పోరాడుతూ కూడా ”మనం ” వంటి క్లాసిక్ చిత్రంలో నటించి నటన పట్ల తనకున్న మక్కువ చాటుకున్నారు. ఈరోజు సెప్టెంబర్ 20 …….. మహానటులు అక్కినేని నాగేశ్వరరావు 99 వ జయంతి. ఆ సందర్బంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఘన నివాళి అందిస్తోంది JSW & JaiSwaraajya.tv.

    DRUMS SIVAMANI :రామప్పను సందర్శించిన డ్రమ్స్ శివమణి

    drums-sivamani-drums-sivamani-visited-ramappa
    drums-sivamani-drums-sivamani-visited-ramappa
    drums-sivamani-drums-sivamani-visited-ramappa
    drums-sivamani-drums-sivamani-visited-ramappa

    సినీ ప్రముఖులు డ్రమ్స్ శివమణి రామప్పను సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 వ సంవత్సరంలోకి అడుగు పెడుతుండటంతో పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ వజ్రోత్సవాలలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం, అలాగే పర్యాటక క్షేత్రమైన రామప్పను సందర్శించారు డ్రమ్స్ శివమణి. రామప్ప లో శివుడికి పూజలు నిర్వహించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.

    రామప్ప శిల్ప సంపదను చూసి అచ్చెరువొందిన శివమణి కాకతీయ కళావైభవానికి ఫిదా అయ్యారు. అలాగే JSW , Jaiswaraajya కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ తో మాట్లాడుతూ రామప్పను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని సంతోషాన్ని వ్యక్తం చేసారు. అలాగే JSW యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

    RENU DESAI- TIGER NAGESHWAR RAO: ఆ సినిమాలో రేణు దేశాయ్ పాత్ర ఇదే నట

    renu-desai-tiger-nageshwar-rao-renu-desais-role-in-that-movie-is-the-same-actor
    renu-desai-tiger-nageshwar-rao-renu-desais-role-in-that-movie-is-the-same-actor
    renu-desai-tiger-nageshwar-rao-renu-desais-role-in-that-movie-is-the-same-actor
    renu-desai-tiger-nageshwar-rao-renu-desais-role-in-that-movie-is-the-same-actor

    రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ” టైగర్ నాగేశ్వర్ రావు ”. స్టూవర్టుపురం దొంగ అయిన టైగర్ నాగేశ్వర్ రావు అప్పట్లో పెను సంచలనం సృష్టించాడు. అటు పోలీసులను ఇటు కొంతమంది ప్రజలకు నిద్రలేకుండా చేసాడు. అలాంటి వ్యక్తి బయోపిక్ రూపొందుతోంది. కాగా ఆ ఆసినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా నటిస్తోంది.

    తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంలో ” హేమలత లవణం ” అనే క్యారెక్టర్ పోషిస్తోంది రేణు దేశాయ్. కాగా తన పాత్రకు సంబందించిన సన్నివేశాలు అలాగే డైలాగ్స్ ని దర్శకుడు వంశీ పంపించాడట. దాంతో తన సన్నివేశాలను చూసి సంతోషించింది. దాంతో ఆ స్క్రిప్ట్ కు సంబందించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టింది.

    పవన్ కళ్యాణ్ తో విడిపోయాక పూణే వెళ్ళిపోయింది రేణు దేశాయ్. తన ఇద్దరు పిల్లలతో ఉంటున్న రేణు దేశాయ్ కు రెండో పెళ్లి మీద గాలి మళ్లింది. ఆమధ్య ఓ వ్యక్తితో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్లి గురించి మాత్రం వెల్లడించలేదు. ఆ పెళ్లి ఏమయ్యిందో తెలీదు. ఇటీవల మళ్ళీ పెళ్లి గురించి వ్యాఖ్యానించింది రేణు దేశాయ్. అంటే త్వరలోనే మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఖాయమే అని తెలుస్తోంది. 

    వైజాగ్ ఝాన్సీకి అభినందనలు

    congratulations-to-vizag-jhansi
    congratulations-to-vizag-jhansi
    congratulations-to-vizag-jhansi
    congratulations-to-vizag-jhansi

    వైజాగ్ ఝాన్సీని అభినందించింది JSW , Jaiswaraajya బృందం. అమెరికాలో ఉన్న  JSW , Jaiswaraajya అడ్వైజరీ , Ublood App ఫౌండర్ జగదీశ్ యలమంచిలి , JSW , Jaiswaraajya బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ ఆదేశాల మేరకు ఇక్కడి బృందం వైజాగ్ ఝాన్సీని ఘనంగా సన్మానించింది. వైజాగ్ ఝాన్సీ తో పాటుగా ఆమె డ్యాన్స్ బృందాన్ని కూడా అభినందించారు.

    వైజాగ్ ఝాన్సీ ఓ కండక్టర్ అయినప్పటికీ ఆమెకు డ్యాన్స్ పట్ల మక్కువ ఎక్కువ కావడంతో తన కల నెరవేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేసింది. ఇన్నేళ్ల కష్టానికి ప్రతిఫలం లభించింది. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్ ఝాన్సీ పేరు మారుమ్రోగుతోంది. టాలెంట్ ఎక్కడ ఉన్నా వాళ్ళను అభినందించడంలో JSW , JaiSwaraajya యాజమాన్యం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. అందుకే ఆ కళాకారులను సన్మానించింది. Jai swaraajya and jsw Communication manager chiluveru shankar.

    మహిళపై కత్తితో దాడి చేసిన ఎమ్మెల్యే పీఏ

    mla-pa-who-attacked-the-woman-with-a-knife
    mla-pa-who-attacked-the-woman-with-a-knife
    mla-pa-who-attacked-the-woman-with-a-knife
    mla-pa-who-attacked-the-woman-with-a-knife

    జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్ ఓ మహిళపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆ మహిళ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాగంటి గోపీనాథ్ దగ్గర పనిచేసే విజయ్ సింహకు నేర చరిత్ర కూడా ఉందట. సోషల్ మీడియాలో ఓ మహిళకు పరిచయమయ్యాడు విజయ్ సింహా.

    ఆ పరిచయం కాస్త ఎక్కవ కావడంతో నెంబర్లు షేర్ చేసుకొని ఫోన్ లు మాట్లాడుకునే స్థాయికి వచ్చారు. ఆ తర్వాత సదరు మహిళకు న్యూడ్ కాల్స్ కూడా చేయడం మొదలు పెట్టాడట. దాంతో ఆమె కాస్త అవాయిడ్ చేసింది. ఇక నిన్న సదరు మహిళ ఇంటి అడ్రస్ కనుక్కుని ఏకంగా ఇంటికే వచ్చి ఆ మహిళతో గొడవ పడటమే కాకుండా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆమె భర్త ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. 

    PRIYANKA ARUL MOHAN- RAJINIKANTH:డైరెక్టర్ తో విబేధాలు- తప్పుకున్న హీరోయిన్

    priyanka-arul-mohan-rajinikanth-disagreements-with-the-director-the-lost-heroine
    priyanka-arul-mohan-rajinikanth-disagreements-with-the-director-the-lost-heroine
    priyanka-arul-mohan-rajinikanth-disagreements-with-the-director-the-lost-heroine
    priyanka-arul-mohan-rajinikanth-disagreements-with-the-director-the-lost-heroine

    సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ” జైలర్ ”. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమానుండి ప్రియాంక అరుళ్ మోహన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు కానీ ఈ భామ మాత్రం మొహమాటం లేకుండా తప్పుకుందట. దాంతో హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం.

    అయితే ఇలా ఆ సినిమా నుండి తప్పుకోవడానికి కారణం ఏంటి ? అని ఆరా తీయగా దర్శకుడు నెల్సన్ తో ప్రియాంకకు వచ్చిన విబేధాలే కారణమని తెలుస్తోంది. గతంలో నెల్సన్ దర్శకత్వంలో డాక్టర్ అనే సినిమాలో నటించింది ఈ భామ. ఆ సినిమా తెలుగు , తమిళ భాషల్లో పెద్ద హిట్ అయ్యింది. సినిమా హిట్ అయ్యింది కానీ షూటింగ్ సమయంలో నెల్సన్ వ్యవహరించిన తీరుకు ప్రియాంక అరుళ్ మోహన్ చాలా బాధపడిందట.

    అందుకే జైలర్ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక మోహన్ తప్పుకోవడంతో ఆ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేశారట. ఇంకేముంది రజనీకాంత్ సినిమా కాబట్టి బల్క్ డేట్స్ ఇచ్చేసిందట తమన్నా. గతకొంత కాలంగా తమన్నా సక్సెస్ కొట్టలేకపోతోంది. దాంతో జైలర్ పై భారీగా ఆశలు పెట్టుకుంది. మరి ఈ జైలర్ ఏమౌతుందో చూడాలి. రజనీకాంత్ కు కూడా చాలాకాలంగా సరైన హిట్ లేదు మరి. 

    NBK- NANDAMURI BALAKRISHNA- PURI JAGANNADH: బాలయ్య సంచలన నిర్ణయం : పూరీతో సినిమా ?

    nbk-nandamuri-balakrishna-puri-jagannadh-balayyas-sensational-decision-movie-with-puri
    nbk-nandamuri-balakrishna-puri-jagannadh-balayyas-sensational-decision-movie-with-puri
    nbk-nandamuri-balakrishna-puri-jagannadh-balayyas-sensational-decision-movie-with-puri
    nbk-nandamuri-balakrishna-puri-jagannadh-balayyas-sensational-decision-movie-with-puri

    నటసింహం నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్ వంటి డిజాస్టర్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పూరీ జగన్నాథ్ కు చాలాకాలంగా వరుస పరాజయాలు ఎదురౌతున్నాయి. అయినప్పటికీ అప్పట్లో బాలయ్య ఛాన్స్ ఇచ్చాడు పైసా వసూల్ రూపంలో.

    కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. బాలయ్య చిత్రాల్లోనే చెత్త చిత్రంగా నిలిచింది. కాకపోతే బాలయ్య క్యారెక్టర్ కొత్తగా ఉండటంతో బాలయ్య ఫిదా అయ్యాడు. పైసా వసూల్ చిత్ర ఫలితాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ సమయంలోనే బాలయ్య దగ్గరకు వెళ్లిన పూరీ సారీ చెప్పాడట. మీతో తప్పకుండా పెద్ద హిట్ తీస్తానని అన్నాడట.

    కట్ చేస్తే ఇటీవల లైగర్ చిత్రంతో పెద్ద హిట్ కొట్టాలని పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోవాలని అనుకున్నాడట. కానీ లైగర్ కోలుకోలేని దెబ్బ కొట్టడంతో డీలా పడ్డాడు. ఈ సమయంలో స్టార్ హీరోలు పూరీ కి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ బాలయ్య శైలే వేరు దాంతో బాలయ్యను పూరీ కలవగానే చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దాంతో పూరీ చాలా సంతోషంగా ఉన్నాడు. అలాగే పైసా వసూల్ తో ప్లాప్ ఇచ్చాను కాబట్టి ఈసారి తప్పకుండా బాలయ్యకు బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే అని కసిగా ఉన్నాడట. అయితే బాలయ్య అభిమానులు మాత్రం ఈ వార్త విని షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే పూరీ ప్లాప్ డైరెక్టర్ కాబట్టి. 

    APSARA RANI- RAMGOPAL VARMA: హీరోయిన్ అందాలపై కామెంట్ చేసిన వర్మ

    apsara-rani-ram-gopal-varma-varma-commented-on-the-heroines-beauty
    apsara-rani-ram-gopal-varma-varma-commented-on-the-heroines-beauty
    apsara-rani-ram-gopal-varma-varma-commented-on-the-heroines-beauty
    apsara-rani-ram-gopal-varma-varma-commented-on-the-heroines-beauty

    వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ హీరోయిన్ అప్సర రాణి అందాలపై కామెంట్ చేసాడు. తాజాగా అప్సర రాణి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న సమయంలో వీడియో తీయించుకుంది. వయ్యారంగా ఈత కొట్టిన సమయంలో ఈభామ అందాలు మరింతగా కవ్వించేలా ఉన్నాయి. ఇక స్విమ్మింగ్ తాలూకు వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో పై వర్మ కామెంట్ చేసాడు.

    అప్సర రాణి ఇంత హాట్ గా ఉంటె ఆ స్విమ్మింగ్ పూల్ లోని వాటర్ ఎందుకు ఆవిరి కాలేదో అర్ధం కాలేదు అంటూ ట్వీట్ చేసి మరింత వేడి రాజేసాడు. గతకొంత కాలంగా రాంగోపాల్ వర్మ సినిమాల మీద కాన్సంట్రేషన్ చేయడం లేదు. కేవలం హీరోయిన్ ల అందాల మీద మాత్రమే కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. హీరోయిన్ ల అందాలను పొగుడుతున్నాడు.

    అంతేకాదు వాళ్లతో అవకాశం దక్కితే ఎంజాయ్ చేస్తున్నాడు. మందు , మగువ కాదేది అనర్హం అంటూ మందుతో , మగువతో ఎంజాయ్ చేస్తూ చెత్త సినిమాలను తీస్తున్నాడు. వర్మ చేస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నప్పటికీ కొంతమంది భామలు మాత్రం వర్మ అంటే పడి చస్తున్నారు …….. అందులో ఈ అప్సర రాణి కూడా ఒకరు. 

    JSW – JAISWARAAJYA కు శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి

    errabelli-wishes-for-jsw-jaiswaraajya
    errabelli-wishes-for-jsw-jaiswaraajya
    errabelli-wishes-for-jsw-jaiswaraajya
    errabelli-wishes-for-jsw-jaiswaraajya

    JSW & JaiSwaraajya యూట్యూబ్ ఛానల్స్ కు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. JSW & JaiSwaraajya కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ బృందం మంత్రిని కలిసి ఇంటర్వ్యూ తీసుకున్న సమయంలో JSW & JaiSwaraajya అధినేతలైన జగదీశ్ యలమంచిలి , డాక్టర్ శివకుమార్ ఆనంద్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు అందజేశారు.

    మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సందర్బంగా ప్రవాసాంధ్రులు ముఖ్యంగా జగదీశ్ యలమంచిలి , డాక్టర్ శివకుమార్ ఆనంద్ తదితర మిత్ర బృందం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. దాంతో ఆ సంఘటనలను గుర్తు చేసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి. 

    బంజారాహిల్స్ లో కారు ప్రమాదం

    హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు ప్రమాదం సంచలనం సృష్టించింది. ఆదివారం ఉదయం ( సెప్టెంబర్ 18న ) కారు ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ భీభత్సం సృష్టించాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఈ సంఘటన జరిగింది. వేగంగా కారు దూసుకువచ్చి దేవాలయాన్ని ఢీకొట్టింది. దాంతో కారు పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో కారు నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అతడ్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.