నటసింహం నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లైగర్ వంటి డిజాస్టర్ ఇచ్చిన పూరీ జగన్నాథ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పూరీ జగన్నాథ్ కు చాలాకాలంగా వరుస పరాజయాలు ఎదురౌతున్నాయి. అయినప్పటికీ అప్పట్లో బాలయ్య ఛాన్స్ ఇచ్చాడు పైసా వసూల్ రూపంలో.
కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. బాలయ్య చిత్రాల్లోనే చెత్త చిత్రంగా నిలిచింది. కాకపోతే బాలయ్య క్యారెక్టర్ కొత్తగా ఉండటంతో బాలయ్య ఫిదా అయ్యాడు. పైసా వసూల్ చిత్ర ఫలితాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ సమయంలోనే బాలయ్య దగ్గరకు వెళ్లిన పూరీ సారీ చెప్పాడట. మీతో తప్పకుండా పెద్ద హిట్ తీస్తానని అన్నాడట.
కట్ చేస్తే ఇటీవల లైగర్ చిత్రంతో పెద్ద హిట్ కొట్టాలని పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోవాలని అనుకున్నాడట. కానీ లైగర్ కోలుకోలేని దెబ్బ కొట్టడంతో డీలా పడ్డాడు. ఈ సమయంలో స్టార్ హీరోలు పూరీ కి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ బాలయ్య శైలే వేరు దాంతో బాలయ్యను పూరీ కలవగానే చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దాంతో పూరీ చాలా సంతోషంగా ఉన్నాడు. అలాగే పైసా వసూల్ తో ప్లాప్ ఇచ్చాను కాబట్టి ఈసారి తప్పకుండా బాలయ్యకు బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే అని కసిగా ఉన్నాడట. అయితే బాలయ్య అభిమానులు మాత్రం ఈ వార్త విని షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే పూరీ ప్లాప్ డైరెక్టర్ కాబట్టి.