![TRS transforms as BRS TRS transforms as BRS](https://jaiswaraajya.tv/wp-content/uploads/2022/12/TRS-transforms-as-BRS-.jpg)
ఎట్టకేలకు కేసీఆర్ అనుకున్నది నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS ) ను భారతీయ రాష్ట్ర సమితి (BRS ) గా మారుస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం కు అక్టోబర్ లో లేఖ రాయగా ఇన్ని రోజుల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం TRS ను BRS గా గుర్తిస్తూ లేఖ ను పంపించింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందింది. దాంతో రేపు మధ్యాహ్నం భారతీయ రాష్ట్ర సమితిని అధికారికంగా మరోసారి ప్రకటించనున్నారు కేసీఆర్.
ఇన్నాళ్లు తెలంగాణ కోసం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారతదేశం కోసం పని చేయనున్నది. మోడీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న కేసీఆర్ దేశ వ్యాప్తంగా తిరగాలని కంకణం కట్టుకున్నారు. మరో 18 నెలల్లో లోక్ సభకు ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో మోడీకి ప్రత్యామ్నాయంగా BRS ను తీర్చి దిద్దాలని అనుకుంటున్నాడు. రేపు అట్టహాసంగా BRS ఆవిష్కార దినోత్సవాన్ని జరుపనున్నట్లు తెలుస్తోంది.