39 C
India
Tuesday, May 12, 2026
More

    10 లోపే ప్రేమ.. పెళ్లి.. బిడ్డ.. చివరకు ట్విస్ట్

    Date:

    పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వారికి కూడా సంసారం ఈదడం కష్టమే. అలాంటిది మైనర్ల వల్ల ఏమౌంతుంది. రీసెంట్ మైనర్లు సంసారంలోకి అడుగుపెట్టారు. అవగాహన లేని వయస్సులోనే పిల్లలకు జన్మనిచ్చారు. సంసారం గురించి ఏమీ అర్థం కాక పిల్లవాడికి కొట్టడంతో విషయాలు కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. వీరి గురించి తెలుసుకున్న పోలీసులు ఒకింత ఆశ్చర్యపోవడంతో పాటు మైనర్ వివాహం ఆంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జూబ్లిహిల్స్ పరిధిలో జరిగింది.

    బోరబండకు చెందిన 17 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు 8వ తరగతి నుంచి ప్రేమించకున్నారు. అంటే 14 సంవత్సరాల్లో వారి మధ్య ప్రేమ పుట్టింది. దీంతో పదో తరగతి వరకు అప్పుడప్పుడూ మాట్లాడుకునే వారు. ఇక 2021లో పదో తరగతి పరీక్ష రాసిన వీరు. చివరి పరీక్ష పూర్తయిన వెంటనే బాలికను బాలుడు యాదగిరి గుట్టకు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు.

    ఎటువంటి అవగాహన లేకుండా ఈ జంట కాపురం మొదలు పెట్టింది. వీరికి డిసెంబర్, 2022లో ఓ బాబు పుట్టాడు. ఇద్దరి మధ్య బిడ్డ అడ్డంగా ఉందని భావించిన తండ్రి ఆ శిశువును హత మార్చేందుకు పలు మార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎలాంటి బాధ్యలను మీదేసుకునే వయసు కాకపోవడం, కనీసం చూసి నేర్చుకునేంత కూడా పరిణతి చెందకపోవడంతో జంటలోని భర్త చాలా కన్ఫూజన్ కు గురయ్యాడు. గత మే 4వ తేదీన శిశువును చంపాలని బండకేసి బాదాడు. దీంతో శిశువుకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే ఈ విషయం బాలిక ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. శిశువు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా వైరల్ కావడంతో బాల్య వివాహాల నిరోధక శాఖ కూడా ఫైర్ అయ్యింది. ఎటువంటి అవగాహన లేకుండా చిన్నారులు పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు సమాజాన్ని మరింత నాశనం చేస్తాయని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Age of 35 ఏళ్లు దాటితే సంతానం పొందడం కష్టమే!

    Age of 35 : నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది...

    CIBIL score : వరుడి CIBIL స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు!

    CIBIL score : డబ్బు వైపు పరుగెడుతున్న నేటి సమాజంలో అనూహ్య సంఘటన...

    Marriage with rice cooker : రైస్ కుక్కర్ తో పెళ్లి.. నాలుగు రోజులకే విడాకులు

    Marriage with rice cooker After Divorce : ప్రస్తుతం సోషల్...