తెలుగు సినీపరిశ్రమలో వరుస విషాదాలు అలుముకుంటున్నాయి, సినీప్రముఖులు ఒకరి తరవాత ఒకరు కాలం చేయడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.
ఈ తరుణంలో తెలుగు సినీపరిశ్రమ ఒక సంతాపసభను నిర్వహించింది.
శ్రీ కైకాల సత్యనారాయణ గారు, శ్రీ చలపతిరావు గారు, శ్రీ వల్లభనేని జనార్ధన గారి సంతాప సభకు విచ్చేసిన ప్రముఖులు ముఖ్యంగా పరుచూరి గోపాలకృష్ణ గారు అధ్యక్షత వహించారు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి గారు, సెక్రెటరీ దామోదర ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు, సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ గారు, డైరెక్టర్ బి.గోపాల్ గారు, నిర్మాత డి వి కే రాజు గారు, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీ కాజా సూర్యనారాయణ గారు, చలపతి రావు గారి అబ్బాయి రవి బాబు గారు, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు, మరో నిర్మాత ఆచంట గోపీనాథ్ గారు, రైటర్ సాయినాథ్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సెక్రెటరీ మాదాల రవి గారు రామ సత్యనారాయణ గారు, దర్శకుల సంఘం నుండి కాశీ విశ్వనాథ్ గారు నిర్మాతలు సుబ్బారెడ్డి గారు వై వి ఎస్ చౌదరి గారు మరియు ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు తో సాంకేతిక నిపుణులు హాజరై నివాళులర్పించారు