మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ధమాకా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 23 న విడుదలైన ధమాకా చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో 56 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రతీ రోజు కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది ఈ చిత్రం. ఆరు రోజుల్లోనే 56 కోట్లు వసూల్ చేయడంతో అవలీలగా 75 కోట్లు వసూల్ చేయడం ఖాయమని భావిస్తున్నారు.
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల అందాలు ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. కుర్రాళ్లను ఆకర్షించడంలో శ్రీ లీల అందాలదే ప్రధాన భూమిక. పక్కా ఎంటర్ టైనర్ ధమాకా రూపొందింది. దాంతో యూత్ , మాస్ ప్రేక్షకులు ధమాకా చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ధమాకా సూపర్ హిట్ కావడంతో రవితేజ చాలా చాలా సంతోషంగా ఉన్నాడు.