33.2 C
India
Saturday, May 4, 2024
More

    Andhra Pradesh : ఓటు హక్కుతో ఆస్తి హక్కు కోసం ఆంధ్రుల ఆఖరి పోరాటం!

    Date:

    Andhra Pradesh
    Andhra Pradesh Land titling act

    Andhra Pradesh : నది- నాగలి నేర్పిన నాగరిక మట్టి మనుషులం ! భూమి పుత్రులం !! ఇది వ్యవసాయ భూమి ఉన్న వారి సమస్య మాత్రమే కాదు, గల్లీలో గుడిసె ఉన్న బడుగుల సమస్య; స్థిర చర ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కరి సమస్య ! 300 ఏళ్ల నుంచి తరతరాలుగా వస్తున్న మన ఆస్తి హక్కు సమస్య. ప్రధాని మోడీ ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఏర్పాటు చేస్తుంటే ఆ ఆస్తి హక్కు కబళించడానికి ఆంధ్రలో పెద్ద కుట్ర జరుగుతోంది. డచ్ వారు, ఫ్రెంచ్ వారు, తెల్లవారి కన్నా ముందు ముసల్మానులు ఈ భరత భూమిని ఆక్రమించుకోవడానికి – దోచుకోవటానికి వచ్చారు. భుక్తి కోసం వచ్చి మన భూమిని కాజేయాలనుకున్న వారిని తరిమారు మన పూర్వీకులు. ఈ పోరాటంలో మన పూర్వీకుల రక్తతర్పణమే కాదు, ప్రాణ త్యాగం చేశారు. మళ్లీ ఇంత కాలానికి – స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు – మన ఆస్తిని కాజేయడానికి మన వారే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భూ దందా ముద్దు పేరు “ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 “ కష్టించకడమే గాని కుతంత్రాలు తెలియని శ్వాసించడమే గాని శాసించడం ఎరుగని బడుగులను కూడా మోసం చేయడానికి కొత్త నాటకానికి తెరదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. భారతదేశంలో భిన్నమతాలు, కులాలు, తెగలు, రాష్ట్రాలు వున్నాయి. ఎవరి విశ్వాసాలు – కట్టుబాట్లు- ఆచార వ్యవహారాలు వారివి అయినా, అందరి విశ్వాసాలను కట్టుబాట్లను గౌరవిస్తూ భూ యాజమాన్య హక్కులను విపులంగా స్పష్టంగా చెప్పారు రాజ్యాంగ కర్తలు.

    300 ఏళ్ల నుంచి ప్రాధమిక హక్కుగా వున్న ఆస్తి హక్కు, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా, రాజ్యాంగ హక్కుగా ఆర్టికల్ 300A లో పొందుపరిచారు. ఆస్తి యాజమాన్య హక్కులను రక్షించేందుకు ఆస్తి బదలాయింపు చట్టం – రిజిస్ట్రేషన్ చట్టం – ఇండియన్ స్టాంప్ చట్టం – లిమిటేషన్ చట్టం – ఈజ్మెంట్ చట్టం – ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు చట్టం – ఈనాం రద్దు చట్టం – పట్టాదార్ పాస్ బుక్ చట్టం – సర్వే మరియు హద్దులు చట్టం తదితర రాజ్యాంగబద్ధమైన చట్టాలను ప్రజల ఆస్తి హక్కు రక్షణకు పకడ్బందీగా రూపొందించారు. ఆస్తి యాజమాన్య వివాదం తలెత్తినప్పుడు సివిల్ కోర్టు ద్వారా ఇంత కాలం పరిష్కరించుకుంటున్నారు. దిగువ కోర్టులో న్యాయం జరగనప్పుడు పై కోర్టుకి – ఆ పై కోర్టుకి వెళ్లే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది.

    – మ్యూటేషన్ మాత్రమే రెవెన్యూ అధికారుల అధీనంలో ఉంటుంది.
    – రిజిస్ట్రేషన్ కి ప్రత్యేక విభాగం ఉంది.
    ఆస్తి వారసత్వ హక్కులు హిందువులకు, ముస్లింలకు – కొన్ని తెగల వారికి వేరువేరుగా ఉంటాయి. చట్టపరిధిలో బ్రిటిష్ కాలం నుండి అమలవుతున్నా కాలానుగుణంగా మారుతున్న ఆస్తి హక్కు చట్టాలను న్యాయవ్యవస్థ అమలు చేస్తుంది. ప్రతి దశలో నిర్దిష్టంగా ఆస్తి హక్కు బదలాయింపు జరగడానికి రాజ్యాంగం నియమ నిబంధనలు రూపొందించినా కొందరు రెవెన్యూ అధికారుల అజ్ఞానం వలన, ప్రలోభాలకు లోబడటం వలన అసలైన కక్షిదారులు కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. కాలయాపన జరిగినా, అంతిమంగా న్యాయాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు శిరోధార్యంగా న్యాయవ్యవస్థ నడుస్తున్నది.

    ఇప్పుడు న్యాయవ్యవస్థ ప్రమేయం లేకుండా జగన్ సర్కారు 2023 అక్టోబర్ 31 తేదీన కొత్త చట్టం తీసుకువచ్చారు. రాజ్యాంగం ఇచ్చిన ఆస్తి యాజమాన్య హక్కులు అంతగా తెలియని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సర్వ హక్కులు సంక్రమింప చేసింది జగన్ ప్రభుత్వం. ఇండియన్ స్టాంప్ చట్టం, సర్వే మరియు హద్దులు చట్టం, పట్టాదారు పాస్ బుక్ చట్టం, లిమిటేషన్ చట్టం – తదితర చట్టాలలో జగన్ ప్రభుత్వం చేసిన చాలా మార్పులు సుప్రీంకోర్టు తీర్పులకు – భారత రాజ్యాంగం – వివిధ చట్టాలకు విరుద్దంగా ఉన్నాయి. రెవెన్యూ అధికారుల అలక్ష్యం, అశ్రిత పక్షపాతం వలన ఏర్పడిన అవకతవకలను సరిదిద్దడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆ రెవెన్యూ అధికారులకే సర్వహక్కులు కల్పిస్తోంది జగన్ ప్రభుత్వం. ఇంతకుమించిన మరో దారుణం మరొకటి ఉంది. ఇంతకాలం భూ యాజమానుల పేరిట ఉన్న యాజమాన్య పత్రాలను (డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్) చిత్తు కాగితాలుగా మార్చే ప్రయత్నం చేసింది జగన్ ప్రభుత్వం.

    జగన్ తీసుకొచ్చిన “ల్యాండ్ టైట్లింగ్ ” యాక్ట్ ప్రకారం భూ యజమానులు అందరూ తమకు తాముగా స్వచ్చందంగా రెవెన్యూ అధికారి వద్దకు వెళ్లి తమ భూమి వివరాలు నమోదు చేయించుకోవాలి. ఇలా నమోదు చేయించుకోకపోయినా/సమాచారం సరైనది కాదని రెవెన్యూ అధికారి అభిప్రాయపడినా ఆ ఆస్తి యజమానికి ఆరు నెలలు జైలు శిక్ష మరియు రూ. 50,000/- జరిమానా విధించే అధికారం ఆ అధికారికి ఉంది. భూ యాజమాన్యానికి సంబంధించి యజమాని సమర్పించిన డాక్యుమెంట్స్ కన్నా ఆ అధికారి ఆ డాక్యుమెంట్స్ నిర్ధారణ ఈ చట్టం అతి ప్రధానమైనది. గతంలో రెవెన్యూ అధికారుల తప్పులను కోర్టులో ఛాలెంజ్ చేసి సరి చేసుకునే అధికారం ఉండేది. ఇప్పుడు బాధితులు న్యాయవ్యవస్థను ఆశ్రయించే అవకాశం లేకుండా పోయింది.

    -టైటిల్ ఆఫీసర్ – టైటిల్ రిజిస్టర్ లో నమోదు చేసిన వ్యక్తే ఆ భూమికి శాశ్వత హక్కు దారు. లాండ్ టైటిల్ అధికారి రిజిస్టర్ చేయడంలో తప్పులు జరిగి ఉంటే రెండేళ్ల లోపు జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ వద్ద కేసు దాఖలు చేయాలి. రెండు సంవత్సరాల లోపల ఈ లోపాన్ని గుర్తించకపోయినా/ గుర్తించి కంప్లైంట్ ఇవ్వకపోయినా భూ యజమాని హక్కులు గల్లంతయినట్లే..!

    – ఇప్పటివరకు స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాలకు మాత్రమే ఉన్న ఈ సర్వహక్కులను న్యాయ శాస్త్రంలో – కులమతాల కట్టుబాట్లు పట్ల పరిపూర్ణ అవగాహన లేని అధికారులకు కట్టబెట్టారు జగన్.
    – ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ ఉత్తర్వులపై హైకోర్టులో అప్పిల్ కు అవకాశం లేకుండా కేవలం రివిజన్ కు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది.
    – చరిత్రలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బలపరీక్ష అసెంబ్లీలో కాదు గవర్నర్ బంగ్లాలో జరిగింది. నాటి గవర్నర్ రామ్ లాల్ నోటితో ఎమ్మెల్యేల సంఖ్యను లెక్కించి ఎన్టీఆర్ కి మెజార్టీ బలం లేదని నిర్ధారించారు.

    – ఇలా ఉంటుంది అధికారగణాల పనితీరు..
    – “ రేపు ఈ భూమి నీది కాదు” అని భూ యజమాని సమర్పించిన డాక్యుమెంట్స్ పక్కన పడేసి నకిలీ డాక్యుమెంట్స్ ని నిజమని నిర్ధారణ చేస్తే అసలు భూ యజమానికి దిక్కెవరు..?
    – మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఎన్టీఆర్ తెలంగాణ ప్రజలకు మహోపకారం చేశారు. పట్వారీ అంటే కరణీకం వ్యవస్థను రద్దు చేశారు. ఎన్టీఆర్ రద్దు చేసిన వ్యవస్థని అధికారుల పేరిట ఆంధ్రాలో తాజాగా జగన్ ప్రవేశపెట్టారు.

    – జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని వ్యతిరేకిస్తూ సమ్మెలు జరిగాయి, కోర్టులు పనిచేయలేదు.
    – ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని ప్రతిఘటించండి; మౌనం అంగీకారం అవుతుందని గుర్తించండి.
    – ఈవేళ ఈ భూమి నీది కాదన్నారు, రేపు ఈ భారత భూమి మీద నీవు పుట్టలేదంటే మనకు పుట్టగతులు ఉండవు.
    – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన AP ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, 2022 (ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కుల చట్టం, 2022) ప్రజల పాలిట యమపాశం కాబోతుంది.
    – స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల నుంచి రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవిన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ సేవలు బాధితులకు దూరం కానున్నాయి. ఈ చట్టం పరిపూర్ణంగా అమలులోకి వచ్చిన నాటి నుంచి ఆస్తులన్ని టైటిల్ రిజిస్టేషన్ అధికారి పర్యవేక్షణలోనే ఉంటాయి.

    – మీ చిన్నారి వివాహానికి మీరు పసుపు కుంకుమగా ఇల్లు, పొలం తదితర స్థిర చరాస్తులు గిఫ్ట్ డీడ్ గా ఇవ్వదలిస్తే ముందుగా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి అనుమతి పొందాలి.
    – అలాగే మీ అవసరాలకి మీ ఆస్తి అమ్ముకోవాలంటే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి అనుమతి ఉండి తీరాలి. మీరు బాకీ రాబట్టుకోవటానికి కోర్టు నుంచి తనఖా డిగ్రీ పొందితే, దాన్ని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. సదరు డిక్రీ ని అమలు పరచమని కోర్టుకు వెళ్లాలంటే అప్పుడు కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర నమోదు చేయించుకోవాలి. మీ ఆస్తికి సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి చేసినదే తుది నిర్ణయం. దాన్ని మీరు సాధారణ సివిల్ కోర్టులలో సవాలు చేయటం కుదరదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఆస్తిని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని ఎట్టి పరిస్థితుల్లోనైనా తన వద్దనున్న విభాగాల నమోదు రిజిస్ట్రేషర్ లో చేర్చినట్లయితే మీ తిప్పలు అన్ని ఇన్ని కాదు. సదరు చర్యను మీరు హైకోర్టులో తప్ప కిందికోట్లను సవాలు చేయడానికి వీలు లేదు.

    – టైటిల్ రిజిస్ట్రేషన్ నిమిత్తమైన తర్వాత పెండింగులో ఉన్న దావాలను కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పరిధిలో ఉంచి నమోదు చేయించుకోవాలి. మీకు వ్యతిరేకంగా ఏదైనా కోట్లు తీర్పు వస్తే మీరు సదరు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేయాలనుకుంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర ముందు నమోదు చేయించుకొని సదర్ద్రోపత్రమును సదరు అభ్యులతో జతపరిచి మాత్రమే అప్పీల్ చేసుకోవాలి. పై సందర్భాల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గనుక మీ వివాదాన్ని నమోదు చేసి సర్టిఫికెట్ ఇవ్వకపోయినట్లయితే మీరు వేసిన దావఖాని, అప్పీలు కానీ చెల్లుబాటు కాదు.

    – మీ ఆస్తికి సంబంధించి మీరు ఎవరికైనా పౌర పటాన్ని ఇస్తే సదరు విషయాన్ని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నమోదు చేయించుకోవాలి. ఇన్ని మాటలు అనవసరం మీ ఆస్తికి సంబంధించి ఇక ముందు మీరు ప్రతి విషయానికి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మీద ఆధారపడాలి. ఆఫీసర్ల పనితీరు అందరికీ తెలిసిందే..

    ఇప్పుడైనా మనం మేల్కొనకపోతే- ప్రతిఘటించకపోతే రేపు మన పిల్లల- పిల్లల పిల్లల ఎదుట దోషులుగా నిలబడవలసి వస్తుంది. మన శరీరంలోని రక్తం మీద మనకు ఎంత హక్కు ఉందో ఈ భరత గడ్డమీద జీవించే హక్కు అలా ఉంది; అలాగే మన భూమిపై మనకు జన్మ హక్కు ఉంది. ఆ హక్కును తాకే హక్కు ఏ ఒక్కరికీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భూ యాజమాన్య హక్కు చట్టం 2022 కి వ్యతిరేకంగా ఓటు హక్కుతో పోరాడుదాం.. రండి.. కదలండి.. భూ యాజమాన్య హక్కు గల్లీ లోని గుడెశలతో సహా రిజిస్టర్ అయ్యే అన్ని ఆస్తులకు వర్తిస్తుంది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...