Sonia Deepti : టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శేఖర్ కమ్ముల చేసినవన్నీ దాదాపు చిన్న చిత్రాలే. యూత్ ను దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమాలతో మరింత ఆకట్టుకున్నారు. తన సినిమాల్లో కొత్త వాళ్లను చాలా మందిని పరిచయం చేశాడు. హ్యాపిడేస్, కొత్త బంగారు లోకం, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాల్లో దాదాపు అందరూ కొత్త వారే. ఈ సినిమాలతో కొత్త టాలెంట్ బయటికి వచ్చింది. ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు శేఖర్ కమ్ముల.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ చిత్రాల్లో హ్యాపీ డేస్ ఒకటి. 2007లో విడుదలైన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. కొత్త నటీనటులతో తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇక ఇందులోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. వరుణ్ సందేశ్, తమన్నాకు బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా. ఇక వీరితో పాటు నటించిన టైసన్ (రాహుల్) శ్రావ్స్ (సోనియా దీప్తి) కి కూడా మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమాలో శ్రావ్స్ రోల్ అప్పట్లో కుర్రాళ్లకు బాగా నచ్చేసింది. రింగు రింగుల జుట్టుకు.. మధురమైన వాయిస్ కు అప్పట్లో యూత్ ఫిదా అయ్యారు. హ్యాపీ డేస్ సినిమాతో శ్రావ్స్ అలియాస్ సోనియాకు ఫాలోయింగ్ ఏర్పడింది.
ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసింది సోనియా. ఒకటి రెండు చిత్రాల్లో హీరోయిన్ గా చేసినా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సైడ్ రోల్స్ చేస్తూ వచ్చింది. సోనియాది హైదరాబాదే. కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లపాటు సాఫ్ట్ వేర్ జాబ్ కూడా చేసింది. ఓ ప్రమోషన్ ఈవెంట్లో సోనియాను చూసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాలో తీసుకున్నారు. ఈ సినిమా సోనియాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత వినాయకుడు, బ్రహ్మా లోకం టూ యమలోకం వయా భూలోకం తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. అలాగే కార్తీ ఆవారా, మహేష్ బాబు దూకుడు సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.
2016లో చిన్ని చిన్నీ ఆశలు నాలో రేగేనే సినిమాలో చివరి సారిగా తెరపై కనిపించింది. ఆ తర్వాత ఏడాది తమిళంలోనూ ఒక సినిమా చేసింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ర్టీకి దూరమైంది. ఇటీవల అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మళ్లీ తెరపై కనిపించింది.