26.3 C
India
Monday, June 17, 2024
More

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    Date:

    MI Vs LSG
    MI Vs LSG

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో జరిగిన మ్యాచ్ లో లక్నో టీం  ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో 214 పరుగులతో ఇన్సింగ్స్ ముగించింది. 8 సిక్సులు 5 ఫోర్లతో చెలరేగిన లక్నో బ్యాటర్ నికోలస్ పూరన్  29 బంతుల్లోనే 75 పరుగులు చేసి లక్నో భారీ స్కోరు చేసేందుకు సాయపడ్డాడు.

    లక్నో కెప్టెన్ కూడా 55 పరుగులతో రాణించాడు. ఆఖర్లో ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా కలిసి స్కోరు బోర్డును 214 కు చేర్చారు. ముంబయి బౌలర్లలో నువాష్ తుషారా, పీయూష్ చావ్లా ఇద్దరు చెరో మూడు వికెట్లు తీయగా మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్జున్ టెండూల్కర్ ను ఈ మ్యాచ్ లో ఆడించారు.

    అనంతరం ఛేదనకు దిగిన ముంబయికి రోహిత్ శర్మ, డేవిల్డ్ బ్రేవిస్ ఇద్దరు 88 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించగా.. 88/1 తో పటిష్టంగా ఉన్న ముంబయి 97/3 తో రోహిత్ శర్మ కూడా వెనుదిరగ్గా.. 120 పరుగులకే సగం బ్యాటర్లు పెవిలియన్ చేరగా..  మరోసారి మిడిలార్డర్ వైఫల్యం బయటపడింది. చివర్లో నమన్ దిర్ సిక్సులు, ఫోర్లతో చెలరేగి 28 బంతుల్లోనే 68 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయకపోవడంతో ముంబయి ఓడిపోక తప్పలేదు.

    సూర్య కుమార్ డకౌట్ కావడం, ఇషాన్ కిషన్ స్పీడ్ గా ఆడకపోవడంతో ముంబయి కి ఓటమికి తప్పలేదు. లక్నో టీంకు 14 పాయింట్లు వచ్చినా.. ఆ టీంకు మెరుగైన రన్ రేట్ లేకపోవడంతో ఈ సీజన్ లో ఎలిమినేట్ కాక తప్పలేదు. 14 పాయింట్లతోనే ఉన్న చెన్నై, ఆర్సీబీ మాత్రం ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఒకే ఒక్క బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. 14 పాయింట్లతో ఉన్న ఢిల్లీ, లక్నో ఎలిమినేట్ కాగా.. 14 పాయింట్లే ఉన్న చెన్నై పోటీలో నిలిచింది.

    Share post:

    More like this
    Related

    BRS New Chief : బీఆర్ఎస్ కు కొత్త రథ సారథి?

    BRS New Chief : తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ పార్టీ భవిష్యత్తు...

    Washington DC : మిన్నంటిన ప్రవాసుల సంబురాలు.. వాషింగ్టన్ డీసీలో కూటమి గెలుపుపై భారీ ప్రదర్శన

    Washington DC : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి...

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IPL and Jagan : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమికి జగన్ సీఎం పదవికి లింక్ ఉందా?

    IPL and Jagan : గత ఐపీఎల్ టోర్నీలకు మించిన ఎంటర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    DC Vs LSG : లక్నో ఢమాల్.. ఢిల్లీ గెలుపు

    DC Vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ...