29.2 C
India
Saturday, May 4, 2024
More

    Time for YCP : 2024 వైసీపీకి గడ్డు కాలమే.. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిందే…

    Date:

    Time for YCP : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు గడిచింది. ఇక ముందున్నది ఎన్నికల సంవత్సరమే.. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎదురుదాడి మొదలుపెట్టాయి. వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు కలిసి ముందుకెళ్లాలని టీడీపీ, జనసేన ఒక ఒప్పందానికి వచ్చాయి. బీజేపీని కూడా కలిసి రావాలని కోరుతున్నాయి. అయితే రాష్ర్ట బీజేపీ నాయకులకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా, ప్రస్తుతం కేంద్రం చేతిలోనే ఆ నిర్ణయాధికారం ఉంది. మరోవైపు కేంద్ర పెద్దలు వైసీపీతో సఖ్యతను కొనసాగిస్తున్నారు. మరి ఈ దశలో వైసీపీ కి ఈ సమయం కీలకంగా మారబోతున్నది.

    అయితే కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడి వైసీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నది.  మరోవైపు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం చేసుకుంటున్నది. అయితే వైసీపీ ఓడిపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయనే ప్రచారం జోరుగా మొదలు పెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఐప్యాక్ టీం పనిచేస్తున్నది. వైసీపీ పథకాలు, నిర్ణయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మిగతా పార్టీల తీరు, నెగిటివ్ ప్రచారం కూడా ఈ టీం చూసుకుంటున్నది. అయితే పలు వర్గాలను వైసీపీ పట్టించుకోలదేన్న టాక్ కూడా వ్యతిరేకతను తెలియజేస్తున్నది. కేవలం కొన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొనే వైసీపీ పథకాలు తెచ్చిందని, మిగతా వర్గాలకు మంచి చేసేలా ఎలాంటి పనులు చేపట్టలేదనే అభిప్రాయం వినిపిస్తున్నది.

    అయితే రోజురోజుకూ వైసీపీలో కూడా పరిస్థితి మారుతున్నది. వై నాట్ 175 అన్న నేతలంతా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొంత వెనక్కి తగ్గారు. అయితే వైసీపీలో అధినేత జగన్ తో పాటు ఎమ్మెల్యేల గ్రాఫ్ కూడా ఏం బాగాలేదు. క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణుల ఆగడాలు శ్రుతి మించి పోయాయని టాక్ వినిపిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత పాజిటివ్ ఉన్నా, పట్టణాల వరకు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా వరకు ఓడిపోతారని టాక్ వినిపిస్తున్నది. ప్రజల్లో వీరిపై పూర్తి వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రత్యర్థి టీడీపీ బలం పుంజుకుంటున్నా, వైసీపీ అది గుర్తించడం లేదు. కేవలం సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమాలో వారు ఉన్నారు.

    మరోవైపు రాజధాని అంశం కూడా వైసీపీకి తలనొప్పే. ఏపీ రాజధాని ఏంటి అని అడిగితే ఏ ఒక్కరూ చెప్పలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం జగనే. పక్క రాష్ర్టాల్లో విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులకు ఇలాంటి ప్రశ్నలే ఎదురైనప్పుడు వారంతా ఎంతో బాధతో ఉన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతున్నదని భావిస్తున్నారు. తల్లి రాష్ర్టాన్ని జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం చంపేస్తున్నారని భావిస్తున్నారు. మూడు రాజధానులంటూ వేసిన తప్పటడుగులు అలానే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో యువత దీనిపై గుర్రుగా ఉంటున్నారు. ఒక్క చాన్స్ అంటే తెచ్చుకున్న పాపానికి ఇలా జరిగిందేమిటా అని  నెత్తి కొట్టుకుంటున్నారు. మరి 2024 ఎన్నికల్లో ఈ వ్యతిరేకత ఇలాగే కొనసాగితే, ప్రతిపక్షాల పొత్తులు ఖరారైతే, కేంద్రం తటస్థంగా ఉంటే ఇక జగన్ కు ఉన్నదంతా గడ్డుకాలమే. ఈ సారి అధికారం చేజారితే ఏం జరుగుతుందో తనకు తెలిసినంతగా ఆ పార్టీలో మరెవరికీ తెలియదు. మరి జగన్ ఇప్పటికైనా పార్టీ లైనప్ మార్చుకోవడంలో వేగం పెంచుతారో లేదో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...