31.3 C
India
Wednesday, June 26, 2024
More

    Lokesh Padayatra : ఫ్లెక్సీ పెట్టించి.. అడ్డంగా బుక్కైన వైసీపీ నేత..!

    Date:

    Lokesh Padayatra :
    ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ విచిత్రంగా సాగుతుంటాయి. ఒక్కోసారి పక్క వాళ్లకు నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇందులో టీడీపీ, వైసీపీ ,జనసేన ఎవరికి వారే సాటి అన్నట్లుగా ఈ విచిత్రాలు జరుగుతుంటాయి.
    ఏపీలో టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్నది. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఈ పాదయాత్ర కొనసాగుతుండగా, అక్కడి వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నట్లు ఉన్నాయి. ఎందుకంటే తాజాగా వారు చేసిన పని అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. లోకేష్ బాబు పాదయాత్ర కొనసాగుతున్న దారిలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో కొన్ని ఫ్లెక్సీలు కట్టారు. అసలు వాడు వచ్చే వరకు.. కొసరువాడికి పండుగేనని క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ ఫ్లెక్సీ టీడీపీ నేతలు పెట్టారని అనిపించేలా చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోటోలను కూడా అందులో ముద్రించారు. దీంతో కొన్ని మీడియా సంస్థలు కూడా ఇవి టీడీపీ నాయకులు పెట్టినట్లుగా  కథనాలు వడ్డి వార్చాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎక్కడ ప్రింట్ అయ్యాయా.. అని ఆరా తీస్తే అవి వైసీపీ నేతలు ముద్రించినట్లుగా బయటపడింది.
    స్థానిక నేత బాలినేని ప్రణీత్ రెడ్డి తన అనుచరులతో ఈ పని చేయించాడని తెలిసిపోయింది. దీంతో వైసీపీ నేతల పరువు పోయినట్లయ్యింది. వాళ్లే ఈసారి సీఎం గా జగన్ కారని భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నదని టిడిపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. లోకేష్ పాదయాత్రకు అడ్డు తగిలేలా వైసీపీ కుట్రలు చేస్తూనే ఉన్నదని వారు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇలాంటి ఫ్లెక్సీలు కట్టి నీచ రాజకీయాలకు దిగిందని, లోకేష్ అంటే ఆ పార్టీలో భయం పుట్టుకుందని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్...

    TV-9 Rajinikanth : ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయికి దిగజారిపోయిన టీవీ- 9 రజనీకాంత్

    TV-9 Rajinikanth : జర్నలిస్టు రజనీకాంత్ అంటే గుర్తు పట్టరేమో కానీ.....

    Corporate culture For Funerals : అంత్యక్రియలకు కార్పోరేట్ కల్చర్.. డబ్బులిస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు

    Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు...

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Bhuvaneshwari : అర్ధాంగికి చంద్రబాబు బర్త్‌డే విషెస్… భువనేశ్వరి స్వీట్ రిప్లై..

    Nara Bhuvaneshwari : ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

    Nara Lokesh : ఉండవల్లి నివాసంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన లోకేశ్

    Nara Lokesh : మంగళగిరి ప్రజల కోసం నారా లోకేశ్ ఉండవల్లిలోని...

    Nara Lokesh : తిరుమలలో మంత్రి నారా లోకేశ్ సెటైర్లు – పరదాలు కట్టవద్దని చెప్పిన మంత్రి

    Nara Lokesh : పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ,...

    Balayya Birthday Celebrations : బొర్రా దిలేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

    Balayya Birthday Celebrations : ప్రముఖ తెలుగు నటుడు, హిందూపురం హ్యాట్రిక్...