32.9 C
India
Wednesday, June 26, 2024
More

    Telangana CM KCR : బాబు అరెస్టుపై నోరు మెదపని కేసీఆర్.. తెలంగాణ సీఎం రియాక్షన్ ఎప్పుడో..

    Date:

    Telangana CM KCR is silent on Chandrababu's arrest
    Telangana CM KCR is silent on Chandrababu’s arrest

    Telangana CM KCR :

    స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు మోపుతూ ఏపీ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయించింది. సీఐడీ అరెస్టు చేసినా, ఇప్పుడు అందరూ అనుకునేది మాత్రం ఏపీ ప్రభుత్వమే చంద్రబాబును ఎన్నికల ముందు ఓ వ్యూహం ప్రకారం అరెస్టు చేయించిందనే వాదన బలంగా బయటకు వస్తున్నది. అయితే చంద్రబాబు అరెస్టును అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ విషయంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేవలం కక్షసాధింపు ధోరణితోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు అభిప్రాయపడ్డారు.

    అయితే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఒక్కరి రియాక్షన్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయంపై నోరు మెదపకపోవడంపై తెలుగు తమ్ముళ్లు , ఏపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో చంద్రబాబు, సీఎం కేసీఆర్ తో కయ్యానికి కాలు దువ్వారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ జగన్ కు సహకరించారనేది బహిరంగ రహస్యమే. ఆయన బహిరంగంగానే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించి, అదే వ్యూహాన్ని అమలు చేశారు. అయితే గతంలో చంద్రబాబు వద్ద మంత్రి గా పని చేసిన కేసీఆర్ ఆయన పై ఈ స్థాయిలో ఆగ్రహం పెట్టుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. జాతీయ స్థాయి నేతలు ఇదంతా ఖండిస్తున్నా సీఎం కేసీఆర్ నోరు మెదపకపోవడం సరికాదనే అభిప్రాయం వినిపిస్తున్నది. బీఆర్ఎస్ కు చెందిన కొందరు మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు స్పందించినా, కేసీఆర్ మాత్రం స్పందించకపోవడమేంటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

    ఇక మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఇది పక్క రాష్ర్టం సమస్య… రెండు పార్టీల మధ్య వివాదం.. మాకేం సంబంధం అంటూ ప్రశ్నించారు. ఇక్కడ ఆందోళనలకు తావులేదని చెప్పుకొచ్చారు. దీనిపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. దీంతో ఖమ్మంలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో ఆయన స్పందించారు. ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తారు. తద్వారా తెలంగాణలో ఓటు హక్కు ఉన్న సెటిలర్లను మరోసారి తమవైపు తిప్పుకునే ప్రయత్నించారు. మంత్రి హరీశ్ రావు కూడా చంద్రబాబు అరెస్ట్ సరిగా లేదని వ్యాఖ్యానించినా, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. గతంలో హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందని,దీంతో పాటు కేసీఆర్ కు రాజకీయంగా ఎంతో అండగా గతంలో నిలిచారని పేర్కొన్నారు. ఏదేమైనా తెలుగు తమ్ముళ్లు మాత్రం సీఎం కేసీఆర్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    5G Spectrum Auction : రెండు రోజుల్లోనే ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం

    5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్...

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : విద్యుత్‌ కమిషన్‌పై హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌

    KCR : తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం...

    BRS : బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనా?

    BRS : తెలంగాణో పదేళ్ల పాటు అధికారం చెలాయించిన కేసీఆర్ పార్టీ...

    KCR Arrogance : కేసీఆర్ అహంకారమే ఈ స్థితికి తీసుకొచ్చిందా?

    KCR Arrogance : ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనుభవిస్తున్న అన్ని కష్టాలకు.....

    Gajwel and Siddipet : గజ్వేల్, సిద్దిపేట కేసీఆర్ గౌరవాన్ని కాపాడగలవా?

    Gajwel and Siddipet : పార్లమెంట్ ఎన్నికలకు చివరి దశ పోలింగ్...