30.6 C
India
Monday, May 13, 2024
More

    Salaar : ‘సలార్’పై షాకింగ్ న్యూస్ చెప్పిన నీల్.. ముందే చెబితే బాగుండేదని ఆవేదన!

    Date:

    Salaar
    Salaar

    Salaar : దేశమంతా ‘సలార్’ మేనియా నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్.. మరో మూడు రోజుల్లో(డిసెంబర్ 22న) థియేటర్లలోకి వస్తుండడంతో వారి ఆనందానికి హద్దులేకుండా పోయాయి. ఇప్పటికే పలుచోట్ల అడ్వాన్స్  బుక్కింగ్స్ లు ప్రారంభమయ్యాయి. ఓవర్సీస్ లో బుక్కింగ్స్ దుమ్మురేపుతున్నాయని తెలుస్తోంది. షారుక్ డంకీ చిత్రానికి మించి బుకింగ్స్ జరుగుతున్నాయని తెలిసి డార్లింగ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బుక్కింగ్స్ తెరుస్తుండడంతో.. కలెక్షన్ల వర్షం కురవడం ఖాయంగా కనపడుతోంది. రూ.400కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సలార్ పై ఫ్యాన్స్ తో పాటు సగటు అభిమానుల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.

    తాజాగా సలార్ టీం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈసందర్భంగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీపై కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.. సలార్ మూవీకి కేజీఎఫ్ తో గాని, కేజీఎఫ్ యూనివర్స్ తో గాని ఏ కనెక్షన్ లేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తాను ఫ్యాన్స్ కు ముందే చెబితే బాగుండేదని తెలిపాడు.

    కాగా, ప్రశాంత్ నీల్ కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లూ సలార్ మూవీకి కేజీఎఫ్ కు కథలో సంబంధం ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. ఫస్ట్ లుక్ కానీ, టీజర్లు కానీ, ఫొటోస్ కానీ అన్నీ చూశాక అంతా  కేజీఎఫ్ స్టైల్ లోనే ఉండడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. మళ్లీ సేమ్ నరేషన్ ఉండి.. ఆడియన్స్ కొత్తదనంగా ఫీల్ కాకపోతే సినిమాకు దెబ్బపడే అవకాశం ఉందని ఆందోళన పడ్డారు. కేజీఎఫ్ కథ, స్క్రీన్ ప్లే కొత్తగా ఉండడంతోనే అంత పెద్ద హిట్ అయ్యింది. మళ్లీ అదేబాటలో, అదే స్టోరీ, అదే స్క్రీన్ ప్లే ఉంటే సలార్ లో ఇంకా కొత్త ధనం ఏముంటుందని ఫ్యాన్స్ భయపడ్డారు. ఇప్పటికే ప్రభాస్ కు బహూబలి రేంజ్ లో ఒక్క బ్లాక్ బస్టర్ రాలేదు. ఆ కొరతను సలార్ తీరుస్తుందనే అంచనాతో ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా సలార్ ఉండాలని.. కేజీఎఫ్ ఛాయలే సలార్ లో ఉండొద్దని వారు అభిప్రాయపడుతున్నారు. సలార్ స్టోరీలో ఫ్రెష్ నెస్ ఉండి.. ఆడియన్స్ ను మరో లోకంలోకి తీసుకెళ్లినట్టుగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక కేజీఎఫ్ తో ఏ సంబంధం లేదని డైరెక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Prabhas : దర్శకుల సంఘానికి.. హీరో ప్రభాస్ రూ. 35,00,00 విరాళం

    Hero Prabhas : హీరో ప్రభాస్ తెలుగు చలన చిత్ర దర్శకుల...

    Kalki Update : కల్కి మూవీ నుంచి రేపు మరో అప్ డేట్  

    Kalki Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్...

    Nidhi Agarwal : ఈ అందాల నిధిని ఆదుకోవాల్సింది ప్రభాసే

    Nidhi Agarwal : సినిమాల్లో ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతోందో...