35.3 C
India
Sunday, May 12, 2024
More

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసా?

    Date:

    Hair Loss
    Hair Loss

    Hair Loss : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఇరవైలోనే అరవైలా బట్టతల వస్తోంది. జుట్టు రాలే సమస్యను పరిష్కరించుకోలేమా? దీనికి సరైన సమాధానం లేదా అనే కోణంలో చాలా మంది ఆలోచిస్తున్నారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఒత్తిడే అని చెబుతున్నారు. దీంతో జుట్టు రక్షణకు మనం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుంటే దానికి చక్కనైన పరిష్కారం దొరుకుతుంది.

    జుట్టు రాలే సమస్యను నిరోధించుకోవడానికి ఏఢు రకాల మార్గాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీ తాగడం వల్ల జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. ఇలా కొన్ని రోజులు తాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఉసిరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

    ఉల్లిపాయ రసం జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. ఇది చుండ్రును అరికడుతుంది. ఉల్లిపాయ రసం రోజు తలకు పట్టిస్తే మంచి లాభాలుంటాయి. వేప ఆకులు కూడా జుట్టు రాలే సమస్యకు చక్కని పరిష్కారం చూపుతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. చుండ్రును తొలగించడంలో బలంగా పనిచేస్తాయి.

    పాలకూర రసం తలపై పట్టిస్తే జుట్టు రాలే సమస్యకు చెక్ పెడుతుంది. దీన్ని రె గ్యులర్ గా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య లేకుండా చేస్తుంది. కొబ్బరి లేదా బాదం నూనెను వేడి చేసుకుని తలకు మసాజ్ చేస్తే మంచిది. దీంతో జుట్టు రాలే ఇబ్బందులు కనిపించవు. అరటి పండు, నూనె, తేనె మిశ్రమంతో మందు తయారు చేసుకుంటే జుట్టు రాలే సమస్య దూరం అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    May 12 Speciality : చరిత్రలో ఈ రోజు.. ఈ రోజుకు విశిష్టతలెన్నో..

    May 12 Speciality : ‘గత చరిత్ర భవిష్యత్ తరాలకు బాట’...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gray Hair : జుట్లు తెల్లబడటం కూడా అనారోగ్యానికి దారితీస్తుందా?

    Gray Hair : ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు తెల్ల బడటం, రాలిపోవడం...

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య అందరిని...

    Hair Beautiful : జుట్టును అందంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Beautiful : ప్రతి వ్యక్తిని అందంగా కనిపించాలని ఆశ ఉంటుంది....

    Hidden Behind Hair : జుట్టు వెనక దాగి ఉన్న గుట్టు ఏంటో తెలుసా?

    Hidden Behind Hair : వెంట్రుకలున్న కొప్పు ఎటేసినా అందమే. అదే...