Hidden Behind Hair : వెంట్రుకలున్న కొప్పు ఎటేసినా అందమే. అదే వెంట్రుకలు లేకపోతే దువ్వుకోవడం కుదరదు. అందుకే వెంట్రుకలను జాగ్రత్తగా కాపాడుకుంటారు. సాధారణంగా రాలిపోయిన, కత్తిరించిన వెంట్రుకలు చెత్తతో పాటు పడేస్తుంటాం. అవి భూమిలో కలిసిపోయి కార్బన్, సల్పర్, నైట్రోజనవంటి మూలకాల ఉత్పత్తికి దారితీస్తాయి. వీటి వ్యర్థాలు జలాల్లో కలిసిపోతే ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి.
జుట్టుతో విగ్గులు, కనురెప్పలు, గడ్డం, మీసాలు తయారు చేస్తుంటారు. విదేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంటుంది. కిలో వెంట్రుకలు రూ. 9000ల ధర పలుకుతుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జడల బర్రెలు, సంప్రదాయ దుస్తులు, ఔషధాల తయారు చేస్తుంటారు. పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్ లు ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు వీటిని వాడుతున్నారు.
వెంట్రుకలను చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రియా లాంటి దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. దీనివల్ల మనకు ఎంతో నష్టం కలుగుతోంది. కేశాల అక్రమ రవాణాను అడ్డుకుంటే ఏటా రూ.40 వేల కోట్లు లభిస్తాయి. మానవ శిరోజాలు, కేశ ఉత్పత్తుల తయారీదారులు ఈ మేరకు వెంట్రుకల వల్ల మనకు కలిగే లాభాల గురించి వివరిస్తున్నారు.
శుద్ధి చేసిన శిరోజాల ఎగుమతుల విలువ 2019-20లో రూ.2,288 కోట్లు ఉండగా నిరుడు అది రూ. 4,535 కోట్లకు చేరాయి. ఇలా వెంట్రుకల వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి. ఈనేపథ్యంలో వెంట్రుకల వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా మారుతోంది. ఈ క్రమంలో మనదేశంలో వెంట్రుకల అక్రమ వ్యాపారాన్ని అరికట్టి మనకు సంపదలు పెంచుకోవాలని సూచిస్తున్నారు.