
Hair Loss : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య అందరిని వేధిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా బట్టతల వస్తోంది. దీంతో నలుగురిలో ఉండలేకపోతున్నారు. పూర్వం రోజుల్లో ఏ డెబ్బయి ఎనభై ఏళ్లకో గానీ జుట్టు రాలిపోయేది కాదు. వాతావరణ ప్రభావమో లేక ఇతర కారణాలో కానీ జుట్టు లేత వయసులోనే రాలిపోతోంది. ఇరవైలోనే అరవైలా కనిపించే పరిస్థితి ఉంటోంది.
జుట్టు రాలడానికి జన్యుపరమైన కారణాలు ప్రధానంగా ఉంటున్నాయి. మనం తినే ఆహారం కూడా ఓ కారణంగా నిలుస్తోంది. మన ఆహార అలవాట్లు కూడా జుట్టు రాలడానికి అవరోధంగా నిలుస్తోంది. ఈ కాలంలో అందరు బేకరి ఫుడ్స్ కు అలవాటు పడిపోయారు. అందులో ఉండే పదార్థాలు మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఫలితమే చిన్న వయసులో జుట్టు రాలడం అని తెలుసుకోవడం లేదు.
పూర్వం రోజుల్లో జుట్టుకు కుంకుడు కాయ రసం, ఆముదం రాసుకునే వారు. దీంతో వారికి అరవై ఏళ్లొచ్చినా జుట్టు నల్లగానే కుదురుగా ఉండేది. జుట్టు రాలడం, తెల్లబడటం అనే సమస్యలు వచ్చేవి కావు. నిగనిగలాడే జుట్టు వారి సొంతమయ్యేది. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు ఇప్పుడు జుట్టు తెల్లబడటం, రాలడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
దీని నివారణకు మనం తీసుకునే ఆహారాలు కూడా ప్రధానమే. మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటే జుట్టు రాలే సమస్య ఉండదు. ఒమెగా ఫ్యాట్ 3 ఉండే వాటిని తినడం వల్ల మంచి లాభాలుంటాయి. చేపలు, గుడ్లు, పండ్లు, పాలు తాగడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. జుట్టు రాలే సమస్య నుంచి బయట పడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి.