34 C
India
Saturday, May 11, 2024
More

    Hair loss prevention : జుట్టు రాలకుండా, తెల్లబడకుండా ఉండాలంటే ఈ ఆకు వాడండి

    Date:

    Hair loss prevention
    Hair loss prevention

    Hair loss prevention : ఈ రోజుల్లో అందరు జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఇరవయ్యేళ్లకే అరవైలా కనిపిస్తున్నారు. జుట్టు ఊడిపోవడం లేదా తెల్లబడటం వల్ల ఇబ్బందిగా ఫీలవుతున్నారు. కలర్లు, హెయిర్ డైలు వాడుతూ ఎన్నో ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. కానీ సహజ పద్ధతిలో జుట్టును సంరక్షించుకోవచ్చని తెలుసుకోవడం లేదు. జుట్టు తెల్లబడకుండా రాలిపోకుండా చేసే అద్భుత ఔషధాల్లో కరివేపాకు ప్రధానమైనది. దీంతో మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

    జుట్టు సంరక్షణకు గోరింటాకు సురక్షితమని భావిస్తున్నా కరివేపాకుతో చాలా రకాల లాభాలు దొరుకుతాయి. జుట్టు రక్షణకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఇది దోహదపడుతుంది. దీంతో కరివేపాకును ఉపయోగించుకుని జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. దీన్ని వాడుకుని జుట్టును సంరక్షించుకోవడం ఉత్తమం.

    కొబ్బరినూనె, కరివేపాకును కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలే సమస్యకు పరిష్కారం లబిస్తుంది. ఒక గిన్నెలో కొబ్బరినూనె వేసుకుని వేడి చేసుకుని తరువాత కరివేపాకు వేసి కాసేపు మరిగించిన తరువాత మంట ఆర్పేయాలి. చల్లారాక జుట్టుకు రాసుకుంటే తెల్ల జుట్టు, జుట్టు రాలే సమస్యలకు మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు సమస్యను ఇట్టే దూరం చేసుకోవచ్చు.

    కరివేపాకుతో హెయిర్ డై కూడా వేసుకోవచ్చు. దీనికి ఒక కప్పు కరివేపాకును పేస్ట్ చేసుకుని అందులో అరకప్పు పెరుగు కలుపుకోవాలి. ఈపేస్టును జుట్టుపై అరగంట పాటు ఉంచిన తరువాత కడుక్కోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను వారానికి రెండు నుంచి మూడు సార్లు చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇలా జుట్టును కాపాడుకుని ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. కరివేపాకుతో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు.

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. వయసుతో...

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య అందరిని...

    Hair Beautiful : జుట్టును అందంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Beautiful : ప్రతి వ్యక్తిని అందంగా కనిపించాలని ఆశ ఉంటుంది....

    Curry Leaves Benefits : కరివేపాకుతో జుట్టు, లివర్ సమస్యలు దూరమవుతాయి తెలుసా?

    Curry Leaves Benefits : మనం తినే ఆకుకూరల్లో కరివేపాకు, మునగాకుల్లో ఎన్నో...