Hair Loss : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఇరవైలోనే అరవైలా బట్టతల వస్తోంది. జుట్టు రాలే సమస్యను పరిష్కరించుకోలేమా? దీనికి సరైన సమాధానం లేదా అనే కోణంలో చాలా మంది ఆలోచిస్తున్నారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఒత్తిడే అని చెబుతున్నారు. దీంతో జుట్టు రక్షణకు మనం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుంటే దానికి చక్కనైన పరిష్కారం దొరుకుతుంది.
జుట్టు రాలే సమస్యను నిరోధించుకోవడానికి ఏఢు రకాల మార్గాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీ తాగడం వల్ల జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. ఇలా కొన్ని రోజులు తాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఉసిరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఉల్లిపాయ రసం జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. ఇది చుండ్రును అరికడుతుంది. ఉల్లిపాయ రసం రోజు తలకు పట్టిస్తే మంచి లాభాలుంటాయి. వేప ఆకులు కూడా జుట్టు రాలే సమస్యకు చక్కని పరిష్కారం చూపుతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. చుండ్రును తొలగించడంలో బలంగా పనిచేస్తాయి.
పాలకూర రసం తలపై పట్టిస్తే జుట్టు రాలే సమస్యకు చెక్ పెడుతుంది. దీన్ని రె గ్యులర్ గా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య లేకుండా చేస్తుంది. కొబ్బరి లేదా బాదం నూనెను వేడి చేసుకుని తలకు మసాజ్ చేస్తే మంచిది. దీంతో జుట్టు రాలే ఇబ్బందులు కనిపించవు. అరటి పండు, నూనె, తేనె మిశ్రమంతో మందు తయారు చేసుకుంటే జుట్టు రాలే సమస్య దూరం అవుతుంది.