28.8 C
India
Monday, June 17, 2024
More

    Adinarayana Rao : ఆదినారాయణరావు.. ఓ సంగీత స్వరసాగరం

    Date:

    • మనదేశంలోని ఉన్నతమైన చలనచిత్ర సంగీత దర్శకులలో ఒకరైన ఆదినారాయణ రావు వర్ధంతి ఇవాళ‌. ఆయన్ను స్మరించుకుందాం రండి‌
    Adinarayana Rao
    Adinarayana Rao

    తెలుగు, తమిళ్ష్ భాషల్లోనే కాదు హిందీ సినిమాల్లో కూడా విజయవంతమైన పాటల్ని ఇచ్చారు‌ ఆదినారాయణరావు‌. ఆయనకు ముందే ఎస్.రాజేశ్వరరావు,‌ ఈమని శంకరశాస్త్రి వంటి‌ తెలుగువారు హిందీ సినిమాలకు సంగీతం చేశారు. ఆదినారాయణరావు చేసిన “కుహు కుహు బోలే కోయలియా” పాట ఒక‌ సంచలనం అయింది హిందీలో. ఇది తెలుగు స్వర్ణసుందరి సినిమాలో “హాయి హాయిగా ఆమని సాగే” పాట. ఈ హిందీ పాట హిందీ సినిమాల్లో వచ్చిన తొలి రాగమాలిక.

    అంతర్జాతీయమైన తీరులో ఉండే గానం దక్షిణాది‌ సినిమాలోకి వచ్చింది ఆదినారాయణరావు సంగీతంలోనే! తమిళ్ష్‌లో ఆయన సంగీతం చేసిన అడుత్తవీట్టుపెణ్ సినిమాలో “కణ్ణాలె పేసి‌ పేసి కొల్లాదే” ‌అని పి.బి. శ్రీనివాస్ పాడిన పాటతో అంతర్జాతీయ గానం దక్షిణాదికి వచ్చింది. ఆ పాట మట్టు‌ (tune), వాద్య‌ సంగీతం అంతర్జాతీయమైన తీరులో ఉంటాయి. ఆ అడుత్తవీట్టుపెణ్ సినిమాలో పి.బి. శ్రీనివాస్ గానం ఒక్క తమిళ్ష్ సినిమాకే కాదు మొత్తం దక్షిణాది సినిమా గానానికే మార్గదర్శకమయింది.

    గొల్లభామ సినిమాలో తొలిసారిగా కొన్ని పాటలకు సంగీతం చేశారు ఆదినారాయణ రావు‌. పల్లెటూరిపిల్ల‌ సినిమా సంగీతదర్శకుడుగా ఆయనకు తొలి సినిమా. స్వర్ణసుందరి, స్వర్ణమంజరి, సతీసక్కుబాయి, మహాకవి క్షేత్రయ్య, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరిసీతారామరాజు, భక్తతుకారాం వంటి సినిమాలకు‌ సంగీతం చేశారు‌. “వస్తాడు నా రాజు ఈ రోజు” , ఘనాఘన‌‌‌ సుందరా కరుణా రస మందిరా”, “జాబిల్లి చూసేను నిన్నూ నన్నూ”, “పిలవకురా పిలవకురా” వంటి‌ గొప్పపాటల్ని చేశారు ఆదినారాయాణరావు.

    స్వర్ణసుందరి సినిమాలో “హాయి‌హాయిగా‌ ఆమని సాగె” పాట వంటి‌‌‌‌ గొప్ప రాగమాలికను చేసిన ఆదినారాయణరావు 1962లో స్వర్ణమంజరి సినిమాలో “ఇదియే జీవితానందము” అనే మఱో గొప్ప రాగమాలికను చేశారు‌. ఘంటసాల, పి. సుశీల పాడారు. (తమిళ్ లో మంగయర్ ఉళ్ళమ్ మంగాద సెల్వమ్ “ఇదువే వాళ్విన్ ఆనందమే” అంటూ పి.బి. శ్రీనివాస్, పి. సుశీల పాడారు) భారతదేశ‌ చలన చిత్రాల్లో వచ్చిన ఉన్నతమైన రాగమాలికల్లో రెండు ఆదినారాయణరావు చేశారు!

    ఆదినారాయణరావు పాటలకు చక్కటి వాద్యసంగీతాన్ని నిర్మించేవారు. అల్లూరి‌సీతారామరాజు సినిమాలోని‌ “వస్తాడు నా రాజు”, భక్త తుకారాం లోని “ఘనాఘన సుందర” పాటలు బాణీల పరంగా మాత్రమే కాకుండా వాద్యసంగీతం పరంగా కూడా విశేషమైనవి. ఈ పాటల వాద్యసంగీతంలో mood ఉంటుంది.

    “భారతీయ సంగీత శాస్త్రము ఆదినారాయణీయము” పేరుతో ఒక మంచి పుస్తకం రాశారు. ఈ పుస్తకం‌ ఈయనపోయాక చాలాకాలం తరువాత ప్రచురణం అయింది.

    1914లో పుట్టి, 1991లో వెళ్లిపోయారు‌‌ ఆదినారాయణరావు. తాను చేసిన గొప్ప పాటలుగా ఆయన మనతో ఎప్పుడూ ఉంటారు.

    రోచిష్మాన్
    9444012279

    Share post:

    More like this
    Related

    Cultural Workshop : తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో కల్చరల్ వర్క్ షాప్

    Cultural Workshop : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాలలో విస్తృతంగా చాటేందుకు...

    Jagan Residence : జగన్ నివాసం వద్ద కూల్చివేతలో బిగ్ ట్విస్ట్..!

    Jagan Residence : మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి బయట...

    Chandrababu : జగన్ అప్పులకుప్ప చేసి వెళ్లాడు..చంద్రబాబుకు సవాల్ గా మారనుందా?

    Challenges to Chandrababu : ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కూటమి...

    Dr. Jai Yalamanchili : జగన్ విశాఖ రిషికొండ జగన్ విలాసాలపై ముందే చెప్పిన జై గారు

    Dr. Jai Yalamanchili : వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...