27.6 C
India
Wednesday, June 26, 2024
More

    YCP Govt : విద్యార్థుల తల్లులకు నోటీసులు పంపిన వైసీపీ ప్రభుత్వం

    Date:

    YCP Govt
    YCP Govt

    YCP Govt : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆపద్ధర్మ వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు నోటిస్ లు పంపింది. విద్యార్థుల ఫీ విషయంలో నోటీసు లు పంపి తనకేమి తెలియదన్నట్టుగా జగన్ ప్రభుత్వం ముఖం చాటేసింది. విద్యాదివేన పథకం ఏపీ లో అమలవుతోంది. విద్యార్థుల ఫీ ప్రభుత్వమే చెల్లిస్తోంది. విద్యార్థుల తల్లుల బ్యాంకు ఎకౌంట్ లో ప్రభుత్వం జమ చేస్తుంది. జమ అయిన రూపాయలను వారం రోజుల్లోగా సంబంధిత విద్యా సంస్థకు చెల్లించాలి. ఈ విదంగా బ్యాంకు లో జమ అయిన నగదును కొందరు విద్యార్థుల తల్లులు చెల్లించడంలేదు. ఈ విషయం పై స్పందిస్తూ ఫీ చెల్లించని వారికి నోటిస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాసంస్థలకు ఎవరైతే ఫీ చెల్లించలేదో, వారిని గుర్తించాలని ప్రభుత్వం గ్రామ సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సచివాలయం సిబ్బంది నోటీసులు జారీచేస్తున్నారు.

    ఆపద్ధర్మ ప్రభుత్వం కొత్త తిరకాసు పెట్టింది. మంజూరైన ఫీ చెల్లించని వారికి వచ్చే విద్యాసంవత్సరంలో మంజూరయ్యే ఫీ నేరుగా విద్యాసంస్థలకే చెల్లిస్తామని ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వం చేసిన హెచ్చరిక రెండు విధాలుగా కనబడుతోంది. ఒకటి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని చెప్పకనే చెప్పేసింది. అంటే ప్రజలు బయపడి వెంటనే ఫీ చెల్లించాలని ఆదేశించినట్టు గా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడకుంటే వైసీపీ నాయకుల విద్యాసంస్థలకు విద్యార్థుల తల్లుల నుంచి ముక్కుపిండి ఫీ వసూలు చేసుకోవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

    ముగిసిన విద్యాసంవత్సరంలో ప్రస్తుతం విద్యాసంస్థలకు సెలవులు. సెలవుల్లో కూడా విద్యార్థులు, వారి తల్లితండ్రులు సరదాగా గడపడానికి వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. అకస్మాత్తుగా వచ్చిన నోటిస్ లకు ఇళ్లలో ఉండేది తక్కువ. ఇంటిలో లేని కారణంగా నోటీసు తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నోటిస్ ఎందుకు తీసుకోలేదని కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

    విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే జూన్ మాసంలో ఫీ చెల్లించడానికి అవకాశం ఉంది. విద్యాసంస్థ నుంచి వెళ్ళిపోయేవారు సర్టిఫికెట్ కోసం వెళ్లాల్సిందే. అదేవిదంగా సంస్థలో కొనసాగే విద్యార్థులు జూన్ నెలలో వెళ్లాల్సిందే. అప్పుడు తప్పనిసరిగా ఫీ చెల్లించక తప్పదు. పట్టుమని పదిహేను రోజులకే ఆపద్ధర్మ ప్రభుత్వం నోటీసు ఇచ్చి మానసికంగా వేదించడంపై విద్యార్థులు, వారి తల్లి దండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Corporate culture For Funerals : అంత్యక్రియలకు కార్పోరేట్ కల్చర్.. డబ్బులిస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు

    Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు...

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    Modi viral Pics : ఎమర్జెన్సీ సమయంలో వివిధ వేషధారణల్లో మోదీ.. వైరల్ ఫొటోలు

    Modi viral Pics : 70వ దశకంలో తనకు అధికారం అప్పగించరని...

    Tirupati Laddu : తిరుపతి లడ్డు నాణ్యత చాలా మెరుగు మెరుగుపడింది

    Tirupati Laddu : చాలాకాలం తర్వాత తిరుపతి లడ్డు నాణ్యత చాలా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : జగన్ కు భారీ షాక్.. నిబంధనలు విస్మరిస్తే అంతే..!

    YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు...

    Ex CM Jagan : 200 కి.మీ రోడ్డు మార్గం ద్వారా జగన్ !

    Ex CM Jagan : ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిలోమీటర్ల దూరం ప్రయాణానికి...

    Jagan Why Not 175 : వైనాట్ 175 ఏమైంది జగన్?

    Jagan Why Not 175 : ఎదురుదెబ్బల నుంచి ఎంత త్వరగా...