30 C
India
Tuesday, July 2, 2024
More

    Alcohol : కల్తీ మద్యం ఎలా తయారు చేస్తారో తెలుసా?

    Date:

    Alcohol
    Alcohol

    alcohol : కల్తీ మద్యం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో కల్తీమద్యం విచ్చల విడిగా తయారు చేస్తున్నారు. దీని బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గతంలో బిహార్‌లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మద్య నిషేధం ఉంది కానీ ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్క బిహార్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దందా జోరుగా సాగుతోంది. తాజాగా తమిళనాడులో కల్తీ మద్యం కారణంగా 63మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

    అయితే అసలు కల్తీ మద్యం ఎలా తయారుచేస్తారు. ఇది విషంగా ఎలా మారుతుంది. దీనిని తాగిన వ్యక్తి ఎందుకు చనిపోతున్నాడో తెలుసుకుందాం. కల్తీ మద్యం ఎలా తయారచేస్తారో తెలిస్తే  షాక్ అవుతారు. దీనినే దేశీ మద్యం కూడా అంటారు. చెరకు లేదా ఖర్జూరం, చక్కెర, సాల్ట్‌పెట్రే, బార్లీ, మొక్కజొన్న, కుళ్ళిన ద్రాక్ష, బంగాళాదుంపలు, బియ్యం, చెడిపోయిన నారింజ మొదలైన వాటిని ముడిసరుకుగా ఉపయోగిస్తారు. వీటన్నిటిని కలిపి ఈస్ట్ ద్వారా పులియబెడుతారు. తర్వాత దీనికి ఆక్సిటాక్సిన్, నౌసాదర్, బెస్రాంబెల్ ఆకులు, యూరియా లాంటివి కలుపుతారు.

    ఇవన్నీ నపుంసకత్వానికి దారి తీస్తాయి. అంతేకాకుండా నాడీ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. వీటిని మట్టిలో పాతిపెట్టిన తర్వాత బట్టీ సాయంతో ఆవిరి నుంచి మద్యం తీస్తారు. దీనిని మరింత మత్తుగా మార్చేందుకు మిథనాల్ కలుపుతారు. అయితే ఇలా తయారుచేసిన మద్యం మరింత మత్తుగా మార్చేందుకు నిర్వాహకులు రకరకాల రసాయనాలను వాటికి కలుపుతారు.

    ఈ క్రమంలో అది విషంగా మారుతుంది. యూరియా, ఆక్సిటాక్సిన్, బెస్రాంబెల్ ఆకులు మొదలైన వాటిని కలిపి పులియబెట్టడం వల్ల అది ఆల్కహాల్ (ఇథైల్ ఆల్కహాల్)కు బదులుగా మిథైల్ ఆల్కహాల్‌గా మారుతుంది.  ఇది చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ విషపూరితం కావడానికి ఈ మిథైల్ ఆల్కహాల్ కారణం. ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి దాని ఆల్కైల్ సమూహంలోని ఆల్డిహైడ్‌గా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లి ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మిక్ యాసిడ్ అనే విషంగా రూపాంతరం చెందుతుంది.

    ఇది నేరుగా తాగేవారి మెదడుపై ప్రభావం చూపుతుంది. ఇలా తయారు చేసిన ఆల్కహాల్ మానవ శరీరానికి ప్రాణాంతకంగా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రసాయన ప్రతిచర్య వేగవంతం అవుతుంది. దీని వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు పనిచేయడం ఆపేస్తాయి. కొందరిలో ఈ ప్రక్రియ నిదానంగా ఉంటే మరికొందరిలో వేగంగా ఉంటుంది. దీని కారణంగా చాలా సందర్భాలలో అకాల మరణాలు సంభవిస్తాయి.

    Share post:

    More like this
    Related

    Power Star Whiskey : ఏపీలో ‘పవర్ స్టార్ విస్కీ’.. మందు బాటిల్ పై వైసీపీ, కూటమి మధ్య వార్

    Power Star Whiskey : ఆంధప్రదేశ్ లో ఇప్పుడు ‘పవర్ స్టార్’ విస్కీ...

    Famous Actor : ఇతడు ఒక ప్రముఖ నటుడు, దర్శకుడు కూడా.. గుర్తు పట్టారా?

    Famous Actor : సినిమా ప్రపంచంలో దర్శకులు, నిర్మాతలు, నటులు వేర్వేరు...

    YS Jagan : వైఎస్ జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు

    YS Jagan : వైసీపీ హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ...

    Team India : బార్బడోస్ లోనే చిక్కుకుపోయిన టీం ఇండియా ఆటగాళ్లు.. తుఫాన్ తగ్గితేనే ఇండియాకు

    Team India : టీ20 ప్రపంచకప్ గెలిచిన మరుసటి రోజు నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...

    AP Liquor : మద్యం షాపులపై ఆంక్షలు సరే..మరి బ్లాక్ మార్కెట్?

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు జగన్...

    Alcohol : మందులో ఎంత వాటర్ కలపాలో తెలుసా? 99.9 శాతం మంది చేసేది తప్పేనట!

    Alcohol : మందు బాబులకు అత్యంత ఎక్కువ ఇష్టమైనది ‘విస్కీ’. ఎందుకంటే...

    Alcohol Prices : ఏ రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉంటాయో తెలుసా?

    Alcohol Prices : మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్...