29.8 C
India
Friday, July 5, 2024
More

    AP CM Chandrababu : ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరీ అందజేసిన సీఎం, ఐటీ మినిస్టర్..

    Date:

    AP CM Chandrababu
    AP CM Chandrababu

    AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో పింఛన్లు పంపిణీ వేడుకలా మొదలైంది. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత అమలు చేసిన మొట్టమొదటి కార్యక్రమం ఇదే. మేనిఫెస్టోలో అమలు చేసిన తొలి హామీని వేగంగా అమలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

    ఈ మహోత్తరమైన కార్యక్రమంలో సీఎంతో ఐటీ మినిస్టర్ నారా లోకేశ్ కూడా ఉన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం అర్హుల ఇంటికే వెళ్లి పింఛన్ డబ్బులను అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీంతో సీఎం వస్తున్నారని మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది.

    రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఉన్నారు. వీరి సామాజిక భద్రత కోసం తమ ప్రభుత్వం పింఛన్ పెంచుతుందని చంద్రబాబు ప్రకటించారు. అయితే గతంలో వీరికి ప్రభుత్వం రూ. 3000 కూడా ఇవ్వలేదు. కానీ బాబు ప్రభుత్వం పెంచిన మొత్తం రూ. 4,000 అందజేస్తున్నారు. అయితే పెంచిన మొత్తం కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు.

    ఇచ్చిన మాట మేరకు ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించి మూడు నెలలకు రూ. 12 వేల చొప్పున ఈ నెల జూలై కలుపుకొని రూ. 4000 మొత్తం రూ. 16000 నెలకు లబ్ధిదారులకు అందాయి. అయితే గత ప్రభుత్వం నెలకు అందజేసిన రూ. 3000 వేలకు అదనంగా రూ. 1000 కలిపి జూలై నెలకు చెల్లించాల్సిన 4,000తో రూ. 7000 లబ్ధిదారులకు మంజూరు చేసింది.

    వికలాంగులకు.. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా రూ. 3,000 పింఛన్ అందుతుండగా అది ఇప్పుడు రెట్టింపైంది. ఈ మొత్తం నేటి నుంచే పంపిణీ చేస్తున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వీల్ చైర్ కు పరిమితమైన వారికి పింఛన్ భారీగా పెరిగింది. గతంలో ప్రతి నెలా వారికి రూ. 5,000 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. ఇప్పుడది రూ. 15,000 పెరిగింది.

     

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : సమాజ క్షేమం కోసం పవన్ కళ్యాణ్ సూర్యారాధన

    Pawan Kalyan : రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం డిప్యూటీ సీఎం...

    Superstar Krishna : మహేష్ సినిమాపై నెగిటివ్ ప్రచారం.. సీరియస్ అయిన సూపర్ స్టార్ కృష్ణ

    Superstar Krishna : మహేష్ బాబు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం...

    BRS Party : బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

    BRS Party : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Chandrababu : ఏపీవాసులకు శుభవార్త.. ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

    CM Chandrababu : ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    AP Assembly Speaker : ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా అయ్యన్న పాత్రుడు

    AP Assembly Speaker : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా...

    Motkupalli Narasimhulu : ఏపీ సీఎంను చూసి ఇతర సీఎంలు నేర్చుకోవాలి: మోత్కుపల్లి  నర్సింహులు

    Motkupalli Narasimhulu : ఇతర సీఎంలు ఏపీ సీఎం చంద్రబాబును చూసి...

    Deputy CM Pawan Kalyan : అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు

    Deputy CM Pawan Kalyan :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  సమావేశాలు నేడు...