33.8 C
India
Saturday, May 11, 2024
More

    EB 2 and EB 3 Applications : ఈబీ 2, ఈబీ 3 దరఖాస్తులను నిలిపివేత.. 2024 నుంచి తీసుకోమన్న యూఎస్‌ సీఐఎస్

    Date:

    EB 2 and EB 3 applications
    EB 2 and EB 3 applications

    EB 2 and EB 3 applications : భారతీయులు అమెరికాకు వెళ్లేందుకు, అక్కడ స్థిరపడేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డుల కోసం ఇప్పటికే 1.1 మిలియన్లకు పైగా భారతీయులు క్యూలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఉపాధి ఆధారిత (ఎంప్లాయిమెంట్ బేస్) ఈబీ- 2, -3 కేటగిరీల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2024 నుంచి భారత్ నుంచి ఈబీ-2 లేదా ఈబీ-3 ఐ-485 దరఖాస్తులను స్వీకరించబోమని యూఎస్‌ సీఐఎస్ (యునైటెడ్ స్టేట్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్) ప్రకటించింది.

    తమ ఇన్వెంటరీలో ఈబీ-2, ఈబీ-3 నుంచి ఇప్పటికి గణనీయమైన సంఖ్యలో ఈబీ సర్దుబాటు స్టేటస్ అప్లికేషన్లు ఉన్నాయని యూఎస్‌ సీఐఎస్ స్పష్టం చేసింది. వీటి నేపథ్యంలో 2024 లేదా అంతకు మించి ఆర్థిక సంవత్సరానికి ఎటువంటి అదనపు ఫైలింగ్ ను అంగీకరించలేరు.

    యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలోని 203వ నిబంధన ప్రకారం అమెరికా విదేశాంగ శాఖ ఇమ్మిగ్రెంట్ వీసాల డిమాండ్ ను త్రైమాసికంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు, ఉపయోగించని కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసా నంబర్లు లేకపోవడం వల్ల, ఈబీ -2 మరియు ఈబీ -3 ఇండియా కోసం ఫైలింగ్ తేదీలు చాలా ఆర్థిక సంవత్సరాల వరకు ముందుకు సాగకపోవచ్చు. దీంతో అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వెళ్లాలన్న తమ కలలు ఎప్పుడు నెరవేరుతాయని ఎదురు చూస్తున్నారు. యూఎస్‌ సీఐఎస్ తాజా నిర్ణయం ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    AP Elections 2024 : ఒకరికి ఆశ.. మరొకరికి నిరాశ ..

    AP Elections 2024 : ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లు...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్ పరువు నిలబెట్టుకునేనా..

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2024లో ఎలిమినేట్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related