మాచర్ల రణరంగంగా మారింది. వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు గొడవకు దిగడంతో మాచర్ల లో మంటలు చెలరేగాయి. తెలుగుదేశం పార్టీ జగన్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇంచార్జి బ్రహ్మానంద రెడ్డి పై దాడికి పాల్పడ్డారు వైసీపీ కార్యకర్తలు. దాంతో బ్రహ్మానంద రెడ్డి ని గుంటూరుకు తరలించారు పోలీసులు.
ఇక మాచర్ల లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. అయితే ఈ దారుణ సంఘటన పై స్పందించిన మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇదంతా తెలుగుదేశం పార్టీ చేసిన గొడవలు తప్ప మా కార్యకర్తల తప్పు లేదని.పేర్కొనడం గమనార్హం. మాచర్ల లో అయితే ఇప్పుడు దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మాచర్లలో ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నప్పటికి పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.