27 C
India
Tuesday, June 18, 2024
More

    Sri Subrahmanya : న్యూజెర్సీలో ‘శ్రీ సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు’.. ప్రత్యేక పూజల్లో జై దంపతులు

    Date:

    Sri Subrahmanya
    Sri Subrahmanya

    Sri Subrahmanya : సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందే ఉంటారు యూబ్లడ్ యాప్ ఫౌండర్, జై స్వరాజ్య టీవీ అధినేత డా. జై యలిమంచిలి.  అమెరికాలోని న్యూ జెర్సీలో సాయి దత్త పీఠం మరియు శ్రీ శివ విష్ణువు టెంపుల్ (SSPSSV) ఆధ్వర్యంలో ఆరుపాడై వీడు విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో పూజలు, తదితర కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విజయవాడ దుర్గా ఆలయం ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ శంకర శాండిల్య శర్మ చేతుల మీదుగా పూజాదికాలను వేద పండితులు నిర్వహిస్తున్నారు.

    ఈ వేడుకలకు సంబంధించి సుబ్రహ్మణ్య విగ్రహాన్ని జై-లావణ్య దంపతులు అందజేశారు. ఇంకా కార్యక్రమానికి కావాల్సిన ఖర్చులో ఎంతో కొంత వారు విరాళంగా అందజేయడంతో పాటు పూజలు చేయించడం, పూజాది కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. జై దంపతులకు భక్తిభావాలు ఎక్కువని శంకర శాండిల్య శర్మ ఆశీర్వదించారు. ఆయనకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. విగ్రహాలను చెన్నై నుంచి తెప్పించడంలో, ప్రతిష్ఠాపన వేడుకలు నిర్వహించడంలో జై పాత్ర మరువమని చెప్పారు.

    జూన్ 12న మొదలైన ఉత్సవాలు జూన్ 16 వరకు కొనసాగుతాయి. ఇందులో 12, 13 రోజుల్లో గణపతి పూజల నుంచి 13వ తేదీ ప్రసాద వితరణ వరకు వైభవంగా దేదీప్యమానంగా పూజలు కొనసాగాయి. అయితే 14న ఉదయం గణపతి పూజ, మండప దేవతా పూజలు, జలాధివాసం (సాయంత్రం), అగ్ని ప్రతిష్ఠాపన. మూలమంత్ర హోమాలు, క్షీరాధివాసం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇక 15వ తేదీ (గురువారం) గణపతి పూజతో పాటు మరిన్ని కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

    ఇక చివరి రోజు 16వ తేదీ (శుక్రవారం) మళ్లీ ఉదయం గణపతి పూజతో పూజాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు మిథున లగ్న సుముహూర్తమున యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి, నీరాజనం, మంత్ర పుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉండనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇతర వివరాలకు 733-622-3250,51,52లో సంప్రదించాలని సూచించారు.

    Share post:

    More like this
    Related

    CM Revanth : బస్టాండ్ లో కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు

    CM Revanth : కరీంనగర్ బస్టాండ్ లో గర్భిణికి కాన్పు చేసి...

    CM Chandrababu : పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక...

    Suicide : ప్రియుడి వద్దకు వెళ్లద్దన్నందుకు.. వివాహిత సూసైడ్..

    Suicide : ప్రస్తుత రోజుల్లో మూడు ముళ్ల బంధం అపహాస్యంగా మారుతోంది....

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    Fire Works Celebrations : శ్రీ కృష్ణ మందిర్ ఆధ్వర్యంలో ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్స్..

    Fire Works Celebrations : న్యూ జెర్సీలోని హిందూ అమెరికన్ టెంపుల్...

    Forbes చైర్మన్ తో యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు

    Forbes Chairman -Dr Jai : అమెరికాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో...