![Tata Play-Amazon Prime](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/334880-14-3.webp)
Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు చేతులు కలిపాయి. దీంతో వివిధ ప్యాక్ లతో సబ్ స్క్రైబర్లు ఇటు టీవీ ఛానెళ్లతో పాటు ప్రైమ్ లైట్ కంటెంట్ ను చూడవచ్చు. ఇకపై టాటా ప్లే డీటీహెచ్ సబ్ స్క్రైబర్లు నెలకు రూ.199తో ప్రారంభమయ్యే ఏ ప్యాక్ నైనా ఎంచుకోవచ్చు. దీంతో వివిధ రకాల టీవీ ఛానెళ్లతో పాటు ప్రైమ్ లైట్ కంటెంట్ లభిస్తుంది. అదే బింజ్ చందాదారులు ప్రైమ్ లైట్ తో కలిపి 30కి పైగా ఓటీటీ యాప్ లను ఎంచుకోవచ్చు. ప్రైమ్ వీడియో కలిపి ఆరు ఓటీటీలను ఎంచుకుంటే నెలకు రూ.199 చెల్లించవలసి ఉంటుంది. అదే 33 యాప్ లు కావాలనుకుంటే రూ.349 చెల్లించాలి. కొత్త ప్లాన్లలో నచ్చిన ఓటీటీలను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.
టాటా ప్లేలో ప్రైమ్ లైట్ తో కూడిన ప్యాకేజీలు ఎంచుకున్నవారికి వీడియో కంటెంట్ తో పాటు అమెజాన్ ఈకామర్స్ షిప్పింగ్, షాపింగ్ ప్రయోజనాలు కూడా అందుతాయి. ఆర్డర్ చేసిన రోజు లేదా తర్వాత రోజు డెలివరీ, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే సేల్ లో ముందుగానే పాల్గొనే అవకాశం లభిస్తుంది. మరోవైపు కొత్త ప్లాన్లతో పాటు టాటా ప్లే డీటీహెచ్ కస్టమర్లు అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్ స్క్రిప్షన్ ను రాయితీ ధరతో పొందొచ్చు. వారికి షిప్పింగ్, షాపింగ్, అమెజాన్ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్ ప్రయోజనాలు సహా ఐదు స్క్రీన్లపై ప్రైమ్ వీడియో కంటెంట్ ను వీక్షించే అవకాశం లభిస్తుంది.