ఇక కోలీవుడ్ ప్రేక్షకులకు ఈయన అందించే పాటలు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌంగ్ స్కోర్ కూడా ఆకట్టుకునేది. అందుకే ఈయన సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ”జవాన్” సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు ఈయన తీసుకునే రెమ్యునరేషన్ గురించి దేశ వ్యాప్తంగా ఒక వార్త వైరల్ అవుతుంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘జవాన్’.. ఈ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుంది.. సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుద్ ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి.
ఒక మ్యూజిక్ డైరెక్టర్ కు ఈ రేంజ్ లో ఎప్పుడు పారితోషికం ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషికం అందుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. ఆయనే సినిమాకు 8 కోట్లు అందుకుంటాడు. మరి ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ అనిరుద్ ఆస్కార్ విన్నర్ అయిన రెహమాన్ ను కూడా మించి రెమ్యునరేషన్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసాడు.. దీంతో ఇప్పుడు ఈయన పేరు హాట్ టాపిక్ అవుతుంది.
ReplyForward
|