24.6 C
India
Sunday, June 30, 2024
More

    AP Deputy CM : ఆంధ్రరాష్ట్ర అభ్యున్నతికై అతడి తపస్సు..అందుకే అహర్నిషలు యోగిలా అధ్యయనం

    Date:

    AP Deputy CM
    AP Deputy CM

    AP Deputy CM Pawan Kalyan : పెను తుఫాన్ ఎదురుగా తపస్సు చేసే యోగి అతడు..తాను అనుకున్నది సాధించేందుకు అవమానాలకొర్చిన మహా మనిషి అతడు..అరాచక పాలనను పారదోలి సువర్ణపాలనకు పునాది వేసిన రాజకీయ చతురుడు అతడు.. అతడే పవన్ కల్యాణ్.

    సినిమా రంగంలో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నా.. అహంకారమనే మత్తు తన వంట పట్టకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లే కార్యశీలి పవన్..తన రాష్ట్ర భవిష్యత్ కోసం తన వంతుగా ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి రాగానే రెడ్ కార్పెట్ పలుకలేదు ఎవరు.

    తొలి ఎన్నికల్లో పోటే చేయలేదు. రెండో టర్మ్ ఎన్నికల్లో పోటీ చేస్తే పోటీ చేసిన రెండు చోట్ల ఓడించారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని హేళన చేశారు. అమ్మను, బిడ్డలను తూలనాడారు.. అయినా అన్నీ ఓర్చుకున్నాడు. సరైన సమయంలో సమాధానం చెబుతామనుకున్నాడు. మూడో టర్మ్ ఎన్నికలు రానే వచ్చాయి. క్యాడర్ ఏమనుకున్నా..నాయకులు ఏమనుకున్నా..తాను ఏదైతే నమ్మాడో అదే చేశాడు..రాజకీయ చాణక్యులకే అర్థం కాని చతురతతో శత్రువును దెబ్బకొట్టాడు. ఆ దెబ్బ మాములుది కాదు పదేళ్లు అయిన కోలుకోలేని దెబ్బ..తాను సాధించిన విజయం అసామన్యం. దేశంలో ఏ పార్టీ సాధించలేని వందశాతం స్ట్రైక్ రేటు తనది. రాష్ట్రం సాహో అన్నది. దేశం ఓహో అన్నది..చివరకు పవన్ అయ్యాడు ఏకంగా డిప్యూటీ సీఎం.

    తన రాష్ట్రం బాగు కోసం అతడు అహర్నిషలు కష్టపడుతున్నాడు. పై ఫొటోలో కనిపిస్తున్నట్టుగా.. ఏ IAS officer అవ్వడం కోసమో,IPS officer అవ్వడం కోసమో అన్నట్టుగా.. బండెడు పుస్తకాల లాంటి ఫైల్స్ ను ముందు వేసుకుని కూలంకుషంగా  అధ్యయనం చేస్తున్నాడు.

    రాత్రి అనకా పగలు అనకా అదే పనిగా వారాహి దీక్ష లో ఉండి కూడా ఇంత తాపత్రయంగా పరిశీలించేది ఎవరి కోసమో కాదు.. మన కోసం, మన బిడ్డల కోసం, వారి బిడ్డల కోసం.. తన కుటుంబం కోసం తాపత్రయం పడకుండా, తన కోసం తాపత్రయం పడకుండా..తాను కోరుకుంటే ఎటువంటి ఆనందం, సంతోషం అయినా సరే ఆయన కాళ్ల దగ్గరకు వచ్చి చేరతాయి. కానీ ఆ మహా మంచిమనిషి వాటిని తృణప్రాయంగా వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నాడు.

    ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తన 5 శాఖలకు సంబంధించిన మొత్తం వివరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. రాష్ట్ర ప్రజలుకీ తాను ఏవిధంగా సహాయపడాలో, తన వంతు బాధ్యతగా ఏం చేయాలో అనే దాని కోసమే అరాటపడుతున్నాడు. ఆయన ఆరాటమంతా నవ్యాంధ్ర కోసమే..అది ఫలించాలని కోరుకోవడమే అందరి ఆకాంక్ష.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Chandrababu : ఆడపిల్లల తల్లిదండ్రులకు చంద్రన్న వరం.. ఒకేసారి అకౌంట్లలోకి రూ. 1.5 లక్షలు!

    CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ...

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...