26.8 C
India
Monday, July 1, 2024
More

    Ashwini Touched Audience Hearts : అమ్మా ఉండిపో.. ఆడియెన్స్ మనసులు తాకిన అశ్విని మాటలు.. స్ట్రాంగ్ అవ్వు అంటూ తల్లి సలహా!

    Date:

    Ashwini Touched Audience Hearts
    Ashwini Touched Audience Hearts
    Ashwini Touched Audience Hearts : బిగ్ బాస్ అంటే ఎప్పుడు టాస్కులు, నామినేషన్స్, గొడవలు, ఎలిమినేషన్స్ మాత్రమే కాదు.. ఎమోషనల్ బాండింగ్స్ కూడా ఉంటాయి.. ప్రతీ సీజన్ లో కంటెస్టెంట్స్ అంత ఫుల్ ఎమోషనల్ అయ్యేది ఫ్యామిలీ వీక్ అని చెప్పాలి.. ప్రతీ సీజన్ లో ఈ ఫ్యామిలీ వీక్ అందులో పాల్గొనే కు కంటెస్టెంట్స్ కు మాత్రమే కాదు.. ఆడియెన్స్ ను కూడా ఎమోషనల్ చేస్తుంది.
    ఇక ఇప్పుడు సీజన్ 7 రసవత్తరంగా జరుగుతున్న నేపథ్యంలో ఫ్యామిలీ వీక్ ను బిగ్ బాస్ స్టార్ట్ చేసాడు. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకుని 10వ వారంలోకి బిగ్ బాస్ అడుగు పెట్టారు.. మరి ఇన్ని వారాలుగా తమ కుటుంబాలకు దూరంగా ఉండి కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేని స్థితిలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఉంటారు.
    అలాంటి వారికీ ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులను చూపిస్తే వారో ఆనందం, అంత ఇంత కాదు.. తాజాగా బిగ్ బాస్ నుండి ఫ్యామిలీ వీక్ కు సంబంధించిన వరుస ప్రోమోలు రిలీజ్ అయ్యాయి.. నిన్నటి ఎపిసోడ్ లో మొత్తం ముగ్గురు కంటెస్టెంట్స్ ఇంటి నుండి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు.. శివాజీ కొడుకు, అంబటి అర్జున్ భార్య వచ్చారు..
    శివాజీ తన కొడుకును చూడగానే ఏడ్చిన విధానం చూసి అందరికి కన్నీళ్లు ఆగలేదు. ఇక అంబటి అర్జున్ భార్యను చూసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. చివరిగా హౌస్ లో అశ్విని అమ్మ వచ్చారు.. తన తల్లిని చూసి అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. అందరు చులకన చేస్తున్నారని.. చిన్న చూపు చూస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది.
    దీంతో అశ్విని తల్లి ఆమెను ఓదార్చి మంచి మాటలు చెప్పి అశ్వినికి ఆత్మవిశ్వాసం వచ్చేలా చేసింది. స్ట్రాంగ్ గా ఉండాలని, ఊరికే ఏడవొద్దని చెప్పింది.. నువ్వు బాగా గేమ్ ఆడి స్ట్రాంగ్ అని నిరూపించుకోవాలని నిన్ను చిన్న చూపు చూసిన వారికీ ఎదిగి చూపించాలని చెప్పింది. ఇక వాళ్ళ అమ్మ వెళ్లే సమయంలో ఒక్క రోజు హౌస్ లోనే ఉంచాలని రిక్వెస్ట్ చేసుకుంది.. అమ్మ ఉండిపో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఎపిసోడ్ ఆద్యంతం అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసింది.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prince Yawar : యావర్‌తొ రొమాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా! వీడియో వైరల్

    Prince Yawar : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో...

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...

    Pallavi Prashanth : నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్.. టెన్షన్ లో అభిమానులు

    Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రైతుబిడ్డ...

    Bigg Boss 7 : బిగ్ బాస్ చాణక్యకు బిగ్ షాక్.. చివరకు ఇలా తోసేశారేంటండీ బాబూ!

    Bigg Boss 7 : బిగ్ బాస్ ‘‘చాణక్య’’, బిగ్ బాస్...