![Bangalore Rave Party](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-2-15.jpg)
Bangalore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నట్లు, ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. 103 మందికి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా హేమ సహా 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ రిపోర్టు వచ్చిందని వెల్లడించారు. దీంతో హేమకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద హేమను విచారించనున్నారు. ఆమె ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూర్ రేవ్ పార్టీలో 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం తెలిపారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. వీరిలో తెలుగు సినీ నటి హేమ, యువనటి ఆశూరాయ్ కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు.