![Banglore Rave Party](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-6-15.jpg)
Banglore Rave Party : బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో 103 మందికి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. అందులో తెలుగు నటికి కూడా పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు.
బెంగళూరు నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైనట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.
నివేదికల ప్రకారం తెలుగు నటి హేమ రేవ్ పార్టీలో ఉన్నారు. దాడి తర్వాత మీడియాకు తన గుర్తింపును వెల్లడించవద్దని అధికారులను వేడుకుంది. రెస్ట్ రూమ్ కు వెళ్లే నెపంతో ఆమె రేవ్ పార్టీ జరిగిన అదే ఫామ్ హౌస్ ప్రాంగణం నుండి దొంగచాటుగా బయటకు వచ్చి వీడియో రికార్డ్ చేసింది. ఆ తర్వాత హేమ హైదరాబాద్ లోనే ఉన్నట్లు వీడియో విడుదల చేసింది. అయితే, ఆమె బెంగళూరు ఫామ్ హౌస్ లోనే వీడియో చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పార్టీకి హాజరైన సమయంలో హేమ వీడియోలో ఉన్న దుస్తులనే ధరించి ఉన్న ఫొటోలు కూడా తమ వద్ద ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.