Bro producer బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఆ పాత్ర అచ్చం మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో గొడవ చిలికి చిలికి గాలివానలా మారే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి రాంబాబు సినిమాపై కామెంట్లు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక సినిమాల్లో డైలాగులు పెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు. దీంతో సినిమాకు రాజకీయ రంగు పులుముతున్నారు.
దీనిపై దర్శకుడు సముద్రఖని కూడా స్పందించారు. సినిమాలో భాగంగానే పాత్రను పెట్టడం జరిగింది. అది ఎవరిని ఉద్దేశించింది కాదని చెబుతున్నారు. అనవసరంగా మంత్రి స్థాయిని దిగజార్చుకుంటున్నారు. సినిమాల్లో ఎన్నో మాటలుంటాయి. అన్నింటిని భూతద్దంలో చూసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సినిమా అంటేనే అభూత కల్నలు ఉంటాయి. అవన్ని తనను ఉద్దేశించినవే అనుకుంటే పొరపాటు.
సాయిధరమ్ తేజ్ కూడా దీనిపై స్పందించారు. ఆ పాత్రతో మంత్రికి సంబంధం లేదని వివరించారు. దొంగ దొంగ అంటే భుజాలు పునుక్కుంటున్నారని విమర్శించారు. దీనిపై పవన్ కల్యాణ్ మాత్రం ఇంతవరకు ఎలాంటి కామెంట్లు చేయలేదు. వారాహి యాత్రలో దీనిపై మాట్లాడతారని అనుకుంటున్నారు. మొత్తానికి బ్రో సినిమా సరికొత్త రాజకీయ వివాదానికి తెర తీస్తోందని తెలుస్తోంది.
థర్టీ ఇండస్ట్రీ నటుడు కూడా దీనిపై సంచలన కామెంట్లు చేశాడు. అంబటి రాంబాబు అంటే తనకు తెలియదన్నాడు. దర్శకుడు చెప్పిన విధంగా నటించాను కానీ తాను ఎవరిని ఇమిటేట్ చేయలేనది చెప్పడం గమనార్హం. వైసీపీ నేతలు బ్రో సినిమాను టార్గెట్ చేస్తున్నారు. జనసేన ఇలా ప్రతీకార చర్యలకు దిగడం ఏం బాగాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మునుముందు ఇంకా ఎలాంటి చర్యలు ఉంటాయో తెలియడం లేదు.
మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీద ఆరోపణలు వస్తే స్పందించాలి. తగిన సమాధానం చెప్పాలి. ఆ బాధ్యత మంత్రి మీద ఉంటుంది. ఎందుకంటే ఆ పాత్రకు తనకు సంబంధం ఉందని చెప్పుకుంటున్నారు కాబట్టి వాటికి తగిన సమాధానం చెబితే అందరు సంతోషిస్తారని నిర్మాతల్లో ఒకరైన టీజీ విశ్వప్రసాద్ మంత్రి కామెంట్లను కొట్టిపారేశారు. మంత్రి హోదాలో ఆయన నైతికత నిరూపించుకోవాల్సిందే మరి.