25.2 C
India
Friday, June 28, 2024
More

    Chandrababu : పవన్ ను అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు.. ఇప్పుడు 21 సీట్లు గెలిచారు

    Date:

    Chandrababu
    Chandrababu and Pawan

    Chandrababu : ‘పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వం. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఎమ్మెల్యే కాలేడు. ఆయన కనీసం ఎంపీటీసీగా కూడా గెలవలేరు. సినిమా తీసుకుంటే కనీసం డబ్బులైనా వస్తాయి’ అని ఒకటి కాదు రెండు కాదు అనేక విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పై రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా విమర్శలు గుప్పించారు.

    అయినా పవన్ కళ్యాణ్ చాలా ఓపికగా రాజకీయాలు చేశాడు. వైసీపీ విమర్శలకు జనసైనికులు కుంగిపోలేదు.. భయపడలేదు. వ్యూహం నాకు వదిలేయండి.. మీరు ఒట్లు వేయించండి అని చెప్పిన పవన్ కల్యాణ్ అన్నట్లుగానే వ్యూహం రచించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర ట్రోల్స్ నడుస్తున్నాయి. అసెంబ్లీ గేటు తాకనియ్యనన్నారు కదా… మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

    ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు గెలుచుకున్నప్పుడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అవహేళన చేశారని అన్నారు. ఇవాళ కూటమికి 164 సీట్లు వచ్చాయని, ఇది దేవుడిచ్చిన స్క్రిప్ట్ అని వ్యాఖ్యానించారు. పవన్ అసెంబ్లీ గేటును కూడా తాకలేరని కొందరు విమర్శించారని గుర్తు చేసిన ఆయన.. పవన్ పోటీ చేసిన 21 స్థానాల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించారని అన్నారు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు కొనియాడారు. పోటీ చేసిన 21 చోట్లా తమ నాయకులను పవన్‌ గెలిపిస్తే.. వైనాట్‌ 175 అన్న వైసీపీ 11 సీట్లు కూడా గెలుచుకోలేకపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

    Share post:

    More like this
    Related

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...

    Athidhi Child Artist : ‘అతిథి’ లో హీరోయిన్ చెల్లి పాత్ర వేసిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    Athidhi Child Artist : క్లాసిక్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి...

    Dreams : ఎక్స్ తో లైంగికంగా కలిసినట్లు కల వస్తే మంచిదా? కాదా? అసలు దీని అర్థం ఏంటంటే?

    Dreams : కలలు సర్వ సాధారణం. వీటిపై కొన్ని థియరీలు ఉన్నాయి....

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : జగన్ అప్పులకుప్ప చేసి వెళ్లాడు..చంద్రబాబుకు సవాల్ గా మారనుందా?

    Challenges to Chandrababu : ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కూటమి...

    Chandrababu : చంద్రబాబు సూపర్ విక్టరీ..దూసుకెళ్తున్న ఆంధ్రా కంపెనీల షేర్లు

    Chandrababu Victory : చంద్రబాబు ట్రెమండస్ విక్టరీ..ఏపీకి ఎవరూ ఊహించిని పాజిటివ్...

    Balayya Birthday Celebrations : బొర్రా దిలేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

    Balayya Birthday Celebrations : ప్రముఖ తెలుగు నటుడు, హిందూపురం హ్యాట్రిక్...