28 C
India
Friday, July 5, 2024
More

    Mohan Babu : సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ షరతులు.. మోహన్ బాబు షాకింగ్ స్పందన వైరల్

    Date:

    Mohan Babu
    CM Revanth – Mohan Babu

    Mohan Babu : పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల కారణంగా ప్రచార బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి, అడ్మినిస్ర్టేషన్ పై పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి.  ప్రస్తుతం ఎన్నికలు ముగిసి ఎప్పటిలాగే పాలనమొదలైంది. ఒక్కో అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ముందుకు కదులుతున్నారు.
    ఇక అన్నింటికంటే ముఖ్యంగా డ్రగ్స్ కట్టడికి పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు.  ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ విషయంలో సినిమా వాళ్లను సైతం భాగస్వాములు కావాలంటూ షరతులు విధించారు.

    సీఎం రేవంత్ షరతులివే..
    ‘‘సినిమా టికెట్ల ధరలు పెంచాలని, ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి కావాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు.  కానీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలనే  ప్రయత్నం సినీరంగంలోని వారు ఏ మాత్రం చేయడంలేదు. అది సినిమా మాధ్యమానికి ఉన్న కనీస బాధ్యతగా భావించాలి సూచిస్తున్నారు. . ఇకపై డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై సినిమాకు ముందుగానీ, తరువాత గానీ 3 నిమిషాల వీడియోతో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.  మెగాస్టార్ చిరంజీవిలా డ్రగ్స్ పై అవ‌గాహ‌న క‌ల్పించాలని  ఖరాఖండిగా చెబుతున్నారు. అలా చేయకపోతే వారి సినిమాలకు టికెట్‌ రేట్ల పెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. షరతులను విస్మరిస్తే దర్శనిర్మాతలకు, నటీనటులకు  తాము ఏ మాత్రం సహకరించమని, థియేటర్ల యాజమాన్యాలు కూడా ఇందుకు సహకరించాలి’’ అని రేవంత్ కోరారు.

    ట్విట్టర్ లో స్పందించిన కలెక్షన్ కింగ్..
    సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సూచనలపై కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబు స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విట్టర్) లో ఆయన పోస్ట్‌ పెట్టారు.  డ్రగ్స్‌కు యువత బలి అవుతున్న విషయం గురించి  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి   సినిమా నటీనటులను 1 లేదా 2 నిమిషాల నిడివిలో వీడియో చేసి, ప్రభుత్వానికి పంపించమన్నారు.  తాను ఇంతకు ముందే ఇటువంటి వీడియోలు కొన్ని చేశానని, అయినా సీఎం ఆదేశాల మేరకు సందేశాత్మకమైన కొన్ని వీడియోలు రూపొందించి ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని ఎక్స్ లో రాశారు. తన పోస్ట్‌కు రేవంత్‌, సీఎంవో ఎక్స్‌ ఖాతాలను కూడా మోహన్ బాబు ట్యాగ్‌ చేశారు.

    Share post:

    More like this
    Related

    KCR : కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న ఆ సెంటిమెంట్!

    KCR Sentiment : ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒకరికి...

    Rajarajeswara Temple : రాజరాజేశ్వర ఆలయ ఆవులు, కోడెలు పంపిణీ.. దరఖాస్తు ఇలా..

    Rajarajeswara Temple : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కలు ఎంత...

    Naga Chaitanya : హైదరాబాద్ ను వీడనున్న నాగ చైతన్య..ఇక అక్కడే మకాం!

    Naga Chaitanya :  అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి  టాలీవుడ్ కు...

    Vijayamma : విజయమ్మతో జగన్ కు చెక్.. వైఎస్ షర్మిల మాస్టర్ ప్లాన్ అదుర్స్

    Vijayamma : ఏపీలో పొలిటికల్ గేమ్ కొత్త మలుపు తిరిగిందా? వైసీపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....