![Fire Works Celebrations](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/11/KRISHNA-MANDHIR.png)
Fire Works Celebrations : న్యూ జెర్సీలోని హిందూ అమెరికన్ టెంపుల్ అండ్ కల్చర్ సెంటర్ ఆధ్వర్యంలో కొనసాగే శ్రీ గురువాయోరప్పన్ టెంపుల్ లోని శ్రీ కృష్ణ మందిరం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు నిర్వహించనుంది. ‘హ్యాపీ దివాళి’ పేరిట నిర్వహించే ఈ వేడుకలను ఫైర్ వర్స్క్ సెలబ్రేషన్ ఆలయం ఆవరణలోని గ్రౌండ్ లో నిర్వహిస్తుంది.
ఆలయం గ్రౌండ్ లో నవంబర్ 12వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్ పేరుతో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తుంది. ముందుగా ఆలయంలో స్వామి వారికి పూజాధికాలు నిర్వహించి ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. కార్యక్రమంలో భాగంగా పటాకలు తీసుకొని రావద్దని సూచించింది.
ప్రతీ ఒక్కరూ పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. సంతోషంగా, సందడిగా గడిపేందుకు ప్రతీ ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ఆలయం నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు.