34.5 C
India
Thursday, May 2, 2024
More

    New Jersey Ayyappa Deeksha : న్యూ జెర్సీలో అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభం

    Date:

    Ayyappa Swamy Deeksha
    Ayyappa Swamy Deeksha

    New Jersey Ayyappa Deeksha : కోరిక కోర్కెలు నెరవేర్చే కొంగు బంగారంగా కొలువైన దేవుడు అయ్యప్ప స్వామి. కార్తీకం వచ్చిదంటే చాలు ఆయనకు పూజలు చేస్తూ భక్తులు తరిస్తారు. స్వామిని కొలిచేందుకు ఉవ్విళ్లూరుతారు. హరిహర సుతుడు అయ్యప్పను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని బలంగా విశ్వసిస్తారు. స్వామిని కొలుస్తూ మండల రోజులు (వారికి వీలైనన్ని రోజులు) దీక్షలు స్వీకరిస్తారు. నల్లటి (కాషాయం) దుస్తులు ధరించి మండల రోజులు (41 రోజులు) ప్రతీ రోజు స్వామి వారికి పూజలు, వ్రతాలు, హోమాలు నిర్వహిస్తూ తరిస్తారు.

    సూర్యోదయం కంటే ముందు బ్రహ్మ ముహూర్తంలో లేచి చన్నీటి స్నానం చేసి పూజాధికాలు పూర్తి చేసుకొని వృత్తి పనిలో పడతారు. మధ్యాహ్నం స్వాములంతా కలిసి భిక్ష స్వీకరిస్తారు. ఇక సాయంత్రం పడిపూజలు చేపడుతూ భజనలు, సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. భారత్ లో ఈ విధంగా స్వామి వారిని కొలుస్తారు. అయితే అమెరికాలో కూడా ఇదే విధంగా స్వామి వారిని కొలుస్తూ భక్తులు తరిస్తున్నారు.

    న్యూ జెర్సీలోని హిందూ అమెరికన్ టెంపుల్ అండ్ కల్చర్ సెంటర్ ఆధ్వర్యంలో కొనసాగే శ్రీ గురువాయోరప్పన్ టెంపుల్ లోని శ్రీ కృష్ణ మందిరం స్వాములకు మండల దీక్షలను ఇస్తుంది. మండల దీక్షను 16 నవంబర్, 2023న ఆలయం నిర్వాహకులు ప్రారంభించనున్నారు. ఆలయంలో ప్రతీ శనివారం ఉదయం 7 గంటలకు అయ్యప్పకు అభిషేకం, భజనలు నిర్వహిస్తారు. శాస్త్ర ప్రీతి ఆనువల్ అయ్యప్ప పూజను సోమవారం 25 డిసెంబర్, 2023న నిర్వహించి ఇరుముడి కడతారు.

    వ్రతం పూజలు మండల దీక్ష తీసుకున్న వారికి 15 నవంబర్, 21 రోజుల దీక్ష తీసుకున్న వారికి 5 డిసెంబర్, 11 రోజుల దీక్ష తీసుకున్న వారికి 15 డిసెంబర్ రోజున నిర్వహిస్తారు. ఇరుముడి మకర జ్యోతి దర్శనం 14 జనవరి, 2023న ఉంటుందని తెలిపారు. స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Sai Datta Peetham : సాయి దత్త పీఠంలో మొదటి సారి ఈ అవకాశం.. గతంలో ఎప్పుడూ లేని విధంగా..

    Sai Datta Peetham : న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠం...

    Aggiramaiah Devarapaali : అగ్గి రామయ్య ‘మీట్ అండ్ గ్రీట్’.. బాపట్ల ఎంపీ సీటు దక్కినందుకు అభినందనలు..

    Aggiramaiah Devarapaali : మృధు స్వభావి, స్నేహశీలి, సంఘ సేవకుడు అయిన...