32.5 C
India
Wednesday, June 26, 2024
More

    YouTuber Viral : రీల్స్ కోసం.. అర్ధనగ్నంగా యూట్యూబర్

    Date:

    YouTuber Viral
    YouTuber Viral

    YouTuber Viral : ఈ మధ్య కాలంలో రీల్స్ పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తూ తోటివారిని ఇబ్బంది పెడుతున్నారు. టాలెంట్ నిరూపించుకునేందుకు కొందరు రీల్స్ చేస్తే.. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం మరికొందరు ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేయడం నెట్ లో షేర్ చేయడం ఓ హాబీగా మారిపోయింది. తాజాగా ఓ యూట్యూబర్.. ఢిల్లీలోని సరిజనీ నగర్ మార్కెట్ వీధుల్లో తన వింత చేష్టలతో రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేం పనిరా బాబూ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

    ప్రణయ్ జోషి అనే యూటూ్యబర్ తాజాగా ఢిల్లీలోని సరోజిని నగర్ మార్కెట్లో షర్ట్ ఊడదీసుకొని వీధుల్లో తిరగడం వీడియోలో కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న బట్టల షాపుల్లోకి వెళ్లి బట్టలు కొనుక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే, కొన్ని షాపుల్లో అతడిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. కొన్ని షాపుల వాళ్లు అనుమతినిచ్చారు.

    జనంతో రద్దీగా ఉన్న వీధిలో ఆయన వెళ్తుండగా చాలామంది అతనిని చూసి అసౌకర్యంగా ఫీలయ్యారు. కొంతమంది ఇదేం పిచ్చిరా బాబు అంటూ తిట్టుకున్నారు. కొంతమంది కొట్టేంత పనిచేశారు. అయినా అతను స్పందించకుండా షర్ట్ లేకుండా మార్కెట్ వీధుల్లో తిరిగాడు. కేవలం రీల్స్ చేసేందుకు ఇలా షర్ట్ లేకుండా ఎక్కువ ప్రజలు ఉండే ప్రాంతాల్లో ఇలా వెళ్లినందుకు నెటిజన్లు ఆ యూట్యూబర్ ను ట్రోల్ చేస్తున్నారు. కొంచెం కూడా సిగ్గులేదా అంటూ తిడుతూ పోస్టులు పెట్టారు. దయచేసి ఇలాంటి వారిని ప్రోత్సహించకండి అంటూ పోస్టులు షేర్ చేశారు.

    Share post:

    More like this
    Related

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Narendra Modi : మోదీ ప్రమాణస్వీకారానికి అతిరథమహారథుల రాక

    Narendra Modi : మోదీ ప్రమాణ స్వీకారానికి అతారథ మహారథులు వస్తున్నారు....

    Nitish Kumar – Chandrababu : ఆ ఇద్దరి నేతలపైనే అందరి దృష్టి..

    Nitish Kumar - Chandrababu : లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం...

    Sheshu Madhav : శేషుమాధవ్ కు ‘నాస్’ అత్యున్నత పురస్కారం

    Sheshu Madhav : మూడు దశాబ్దాలుగా వరి, పొగాకు పంటలపై పరిశోధనలు...

    Delhi High Court : ఆప్ ఆఫీస్ స్థలంపై నిర్ణయం తీసుకోండి: ఢిల్లీ హైకోర్టు

    Delhi High Court : అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే ఢిల్లీలో...